భారీ కటౌట్లు, సినిమా పోస్టర్ లు అయ్యేకదా ఒక అమ్మాయి మరణానికి కారణం.


shubhasri
భారీ కటౌట్లు, సినిమా పోస్టర్ లు అయ్యేకదా ఒక అమ్మాయి మరణానికి కారణం.

రోడ్డు ప్రమాదాలు ఎక్కడినుండి అయిన, ఎలా అయినా జరుగుతాయి అని మరోసారి రుజువైంది. 4 రోజుల క్రితం తమిళనాడులొ (చెన్నై) దగ్గర “శుభశ్రీ” అనే అమ్మాయి కి రోడ్డు ప్రమాదం జరిగింది, ప్రమాదం అంటే బండి-బండి గుద్దుకోవడం కాదు, అతి వేగం కూడా కాదు, కేవలం సినిమా ప్రమోషన్ కోసం థియేటర్ ముందు కట్టిన భారీ పోస్టర్.

నిజానికి శుభశ్రీ తప్పు ఏం లేదు ,తాను ఎదావిధిగా రోజు వెళ్లే దారి నుండి వెళ్తుంది, ఒకేసారి సినిమా పోస్టర్ తన బైక్ (స్కూటీ) మీద పడటంతో, తన బండి అదుపు తప్పి కిందపడిపోయింది. తన వెనకాల వస్తున్న బండి తన మీది నుండి వెళ్లిపోయింది. ఇదంతా కేవలం రెప్పపాటు క్షణం లో జరిగిపోయింది అంటే తన కుటుంబ సభ్యులు ఎంత దిగ్బ్రాంతికి గురి అవుతున్నారో, ఏ సాటి మానవాళి అయినా ఆ సంఘటన గురించి మర్చిపోలేకపోతున్నారు.

మన హైదరాబాద్ పట్టణంలొ కూడా భారీ పోస్టర్లు, ఫ్లెక్సీలు, సినిమా, ప్రకటన లకి సంబంధించిన వాటివి ఏమన్న ఉంటే వాటికి “జి.హెచ్.యం.సి” వారూ భారీ మూల్యం చెల్లించాలి అని, తెలంగాణ ముఖ్యమంత్రి గారి తనయుడు “కె.టి.ఆర్” గారు అందరికి హెచ్చరిక జారీచేశారు. అంటే పోస్టర్ ఎవరిది అయినా ఎవ్వరు అనుమతిలేకుండా జనావాసం దగ్గర ఇతరులకి ఇబ్బంది అవుతే దానికి కారణం ఆ పోస్టర్ అంటించిన వాళ్ళది కాదు, పోస్టర్ కర్త వాళ్లకు కుడా కాదు. ఎందుకంటె “జి.హెచ్.యం.సి” వాళ్ళు ఏం సంభంధం లేకుండా ఉంటే సామాన్య మానవుడు ఎవరైనా అలానే చేస్తాడు అని “కె.టి.ఆర్” గారు హెచ్చరించడం జనాలలో చైతన్యం తేవడం గురించి అలోచించి మంచి నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప.

ఇక ముందు అయిన జనాలు జాగ్రత్తగా చూట్టు చూసుకుంటూ వెళ్ళాలి, ప్రమాదాలకు గురు కావొద్దు అని “శుభశ్రీ” ప్రమాదం జనాల అందరికి గొప్ప గుణపాఠం.