ఒకప్పుడు వ్యభిచారిణి అన్నారు ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది


ఒకప్పుడు వ్యభిచారిణి అన్నారు ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది
ఒకప్పుడు వ్యభిచారిణి అన్నారు ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది

సమయం మన చేతిలో ఉండదు. అది ఎలా ఉంటుందంటే మనల్ని ఒకసారి మంచివారుగారు, ఇంకోసారి చెడువారిగాను చూపిస్తుంది. ముక్యంగా సినిమా వాళ్ళకి మీడియా వాళ్ళకి సరిగ్గా సరిపోతుంది ఈ వ్యత్యాసం. సినిమాలు అన్ని ఫ్లాప్ అయినప్పుడు ఫ్లాప్ హీరో-హీరోయిన్ అన్న ఆ మీడియా వారు సినిమాలు హిట్స్ అయ్యాక వారిని మెచ్చుకోక తప్పదు.

కొత్తబంగారు లోకం సినిమా ద్వారా తెలుగు సినిమాకి పరిచయం అయిన నటి ‘శ్వేతా బసు ప్రసాద్’. సినిమాలో తన నటనకి ఫిదా అయిపోయిన వారు చాలా మంది ఉన్నారు, అలా యువతరాన్ని తన వైపు కి తిప్పుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన తనకి హిట్స్ అంతగా రాలేదు. మెయిన్ హీరోయిన్ నుండి సైడ్ క్యారెక్టర్లు అలాగే ఐటెం సాంగ్స్ లో కూడా చేసింది. అవన్నీ చేసినా మంచి పేరు రాలేదు. అలా తను ఇబ్బందుల్లో ఉండి చివరికి వ్యభిచారం చేస్తూ పట్టు పడింది పోలీసులకి. కోర్ట్ కేసు అని మీడియా వారు చేసిన హడావిడికి శ్వేతా బసు ప్రసాద్ మీద జనాలకి, సినిమా వారికి చెడ్డ పేరు పడటం వలన సినిమాలకి దూరం అయ్యింది.

కోర్ట్ కేసు నుండి విముక్తి అయిన శ్వేతా కి సినిమా అవకాశాలు రాలేదు. నెమ్మదిగా పెళ్లి వైపు అడుగులు వేసింది. తను ఆలాంటి స్థితిలో ఉన్నప్పుడు తనని అర్ధం చేసుకున్న తన భర్త సినిమాలకి దూరం అవ్వమని సలహా ఇచ్చేవారు. బాలీవుడ్ లో ‘సన్నీ లియోన్’ లాంటి పోర్న్ స్టార్ వాళ్ళని ఆదరించినప్పుడు తనని కూడా ఆదరించమని చాలా మంది అడిగారు. దానికి ఎవ్వరు సమాధానం చెప్పలేకపోయారు.

అయితే నెమ్మదిగా వ్యభిచారం గురించి మర్చిపోయి హిందీ లో కొన్ని సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఆమెకి ‘ది తాష్కెంట్ ఫైల్స్’ సినిమా వరంలా తగిలింది. ఆ సినిమా ఇప్పుడు ఆస్కార్ కి నామినేట్ అవ్వడం చూసి తనకి మళ్ళీ సినిమా అవకాశాలు ఇవ్వాలి అని కొంతమంది నిర్మాతలు ఆమెతో చర్చలు జరుపుతున్నారు అని బాలీవుడ్ సినీ విశ్లేషకులు గుస గుస లాడుతున్నారు.