ఈ మాయ పేరు ఏమిటో..? కాదు..! – సిద్ శ్రీరామ్


Sid Sriram Ee Maya Peremito Song released
Sid Sriram Ee Maya Peremito Song released

సొంత వీధిలో దారులే ఏకంగా
గుర్తు రాకనే అదేదో మైకంగా
దారి తప్పి నీ ప్రేమలో పడేసినట్టుగా
వెలుగులేని నింగిలా కురవలేని మబ్బులా
పిచ్చెక్కినట్టు ఉందిగా
ఓ ఓ పక్కనే నువ్వు ఉండగా
నీడలో రంగులే చేరుతుండగా

కిట్టు విశ్వప్రగడ గారు మరియు అనూప్ రూబెన్స్ గారికి ముందుగానే సెల్యూట్. రాజ్ తరుణ్, మాళవిక  కాంబినేషన్ లో విజయ్ కుమార్ కొండ గారి దర్శకత్వంలో వస్తున్న సినిమా “ఒరేయ్ బుజ్జిగా…”.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక పాటను రిలీజ్ చేశారు. పాట పాడింది ఎవరో కాదు…;

ఎవరి పాట వింటే అదే పాట దాదాపు ఒక 200 నుంచి 300 సార్లు  లూప్ లో ప్లే అవుతుందో;

తనకు ఇష్టమైన వ్యక్తికి ఆ విషయం చెప్పడానికి ప్రయత్నించి, మాటలు రాక ఇబ్బంది పడే పసిపిల్లలు ఎవరి పాటను మెటాఫర్ గా వాడుకుంటున్నారో;

తమకిష్టమైన వ్యక్తికి ఆ సంగతి తెలియజేయడానికి మాటలు వాడటం ఇష్టపడని అమ్మాయిలు ఎవరి పాటను మెసేజ్ గా, కాలర్ ట్యూన్ గా, రింగ్ టోన్ గా వాడుకుంటున్నారో……  అతడే…

పేరు సిద్ శ్రీరామ్. ఇక రీసెంట్ గా రిలీజైన “ఈ మాయ పేరేమిటో..? పాట వింటున్న మ్యూజిక్ లవర్స్ “మాస్టారూ… కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్…!  అని ప్రేమగా విసుక్కుంటున్నారు. ముఖ్యంగా ఈ పాటలో చెప్పుకోవాల్సింది… రాజ్ తరుణ్ మాళవిక ల మధ్య ఉన్న కెమిస్ట్రీ. హీరోయిన్ హీరో ఇష్టపడటం అదేవిధంగా హీరోయిన్ కూడా హీరోని ఇష్టపడటం. ఆ సంగతి వాళ్లు మాటల్లో కాకుండా రోజువారి వారు కలుసుకున్నప్పుడు తెలిసి తెలియనట్లు, చెప్పి చెప్పనట్లు, అనిపించి అనిపించినట్లు.. రివిల్ చేసుకోవటం లాంటి షాట్స్ ఈ పాటలో చూపించారు.

ఇక అప్పుడెప్పుడో 2014లో “ఒక లైలా కోసం” సినిమా తీసిన విజయ్ కుమార్ సార్ మళ్లీ ఇప్పటికీ  నెక్స్ట్ లెవెల్ లవ్ స్టోరీని మన ముందుకు తీసుకొస్తున్నారు.  ఈ పాట చూస్తే అద్భుతం గా అనిపించిన మరొక విషయం సినిమాటోగ్రఫీ.  చేసింది ఎవరో కాదు ప్రభాస్ “డార్లింగ్” సినిమాకు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు నటించిన “సర్దార్ గబ్బర్ సింగ్” సినిమాకు DOP గా పనిచేసిన చేసిన ఆండ్రూ సార్. హీరో హీరోయిన్లను క్యాప్చర్ చేసిన ఫ్రేమ్స్, లైటింగ్,  కలర్ కాంబినేషన్ ఈ సినిమా స్థాయిని ఎక్కడకో తీసుకెళ్ళాయి.

ఫైనల్ గా ఈ వీకెండ్ మ్యూజిక్ లవర్స్ కి సిద్ శ్రీరామ్ గారు మరొక గిఫ్ట్ ఇచ్చారు ఎంజాయ్ చేయండి.