సిద్ శ్రీరామ్ నుండి మరో మ్యాజిక్..  నీలి నీలి


 

Sid srirams latest song neeli neeli a huge chart buster
Sid srirams latest song neeli neeli a huge chart buster

సిద్ శ్రీరామ్ సెన్సేషనల్ సింగర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అతను పాడిన ప్రతీ పాట కూడా సెన్సేషన్ అవుతోంది. సినిమా కాస్ట్ అండ్ క్రూ తో సంబంధం లేకుండా రాసింది ఎవరైనా, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా సాంగ్ మాత్రం చార్ట్ బస్టర్ అవుతోంది. అలాంటి ఇలాంటి హిట్ కాదు. మ్యూజిక్ లవర్స్ అందరూ అదే పనిగా ఆ పాటనే వింటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అసలు సిద్ శ్రీరామ్ పాట పాడాక హిట్ అవుతుందో లేక హిట్ అయ్యే పాటలే తన దగ్గరకి వస్తాయో తెలియదు కానీ సిద్ శ్రీరామ్ పాడిన లేటెస్ట్ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ అయింది.

గతేడాది “నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు..” అంటూ అల వైకుంఠపురములో చిత్రంలోని సాంగ్ తో యూత్ ను ఊపేసిన సిద్ శ్రీరామ్, ఈసారి ఒక చిన్న సినిమా పాటతో మైమరపిస్తున్నాడు. నిజానికి సిద్ శ్రీరామ్ కు చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడానే లేదు. హుషారు, రాహు వంటి చిన్న సినిమాల్లో కూడా తన పాటలు సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి.

వివిధ సంగీత దర్శకులకు కెరీర్ బెస్ట్ సాంగ్స్ ఇచ్చిన సిద్ శ్రీరామ్, ఈసారి అనూప్ రూబెన్స్ కు చార్ట్ బస్టర్ సాంగ్ ను ఇచ్చాడు. ప్రదీప్ మాచిరాజు హీరోగా తెరకెక్కుతున్న “30 రోజుల్లో ప్రేమించటం ఎలా” చిత్రం నుండి మొదటి సాంగ్ “నీలి నీలి “ను ఇటీవలే మహేష్ బాబు లాంచ్ చేసిన విషయం తెల్సిందే.

విడుదలైన వెంటనే ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది ఈ పాట. కేవలం 5 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్ ను దాటి దూసుకుపోతోంది. ఒక చిన్న హీరోకి ఈ రేంజ్ క్లిక్స్ రావడమంటే విశేషమనే చెప్పాలి. ఇదంతా సిద్ శ్రీరామ్ వల్లనే.