ల‌వ‌ర్ బాయ్ బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది!

ల‌వ‌ర్ బాయ్ బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది!
ల‌వ‌ర్ బాయ్ బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది!

ఎనిమిదేళ్ల విరామం త‌రువాత సిద్దార్థ్ న‌టిస్తున్న తెలుగు చిత్రం `మ‌హా స‌ముద్రం`. `Rx 100` ఫేమ్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రొమాంటిక్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతున్న ఈమూవీలో మెయిన్ హీరోగా న‌టిస్తున్నారు. అదితిరావు హైద‌రీ, అను ఇమ్మానుయేల్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర అనిల్ నిర్మిస్తున్నారు.

ఈ రోజు హీరో సిద్ధార్ధ్ పుట్టిన రోజు ఈ సంద‌ర్భంగా `మహా సముద్రం` నుంచి సిద్ధార్ధ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పోస్టర్లో సిద్దార్థ్ పక్కింటి అబ్బాయి అవతారంలో అందంగా కనిపిస్తున్నాడు. `ఆర్‌ఎక్స్ 100` ఫేమ్‌కి చెందిన అజయ్ భూపతి డైరెక్ట్  చేస్తున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది.

అత్యంత భారీ స్థాయిలో రొమాంటిక్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీని ఆగ‌స్టు 19న తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
సిద్ధార్థ్ చివరిసారిగా 2013 లో విడుదలైన `జబర్దస్త్` అనే చిత్రం లో కనిపించాడు. మ‌ళ్లీ ఇన్నేళ్ల విరామం త‌రువాత తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌టంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచ‌నాలు నెల‌కొన్నాయి.