ప్రభాస్ ఫ్యాన్స్ ని అవమానించిన సిద్దార్థ్


Siddharth insults Prabhas fansయంగ్ హీరో సిద్దార్థ్ ప్రభాస్ ఫ్యాన్స్ ని అవమానించాడు . ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 దాంతో ఇక వంద రోజుల్లో ప్రభాస్ పుట్టినరోజు అంటూ ట్వీట్ చేసాడు ఓ అభిమాని అది సిద్దార్థ్ కంట పడింది ఇంకేముంది ఆ ట్వీట్ పై సెటైర్ వేసాడు సిద్దార్థ్ . వచ్చే సారి 465 రోజుల ముందుగా పుట్టినరోజు రాబోతోంది అని ట్వీట్ చేయండి అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చాడు ప్రభాస్ ఫాన్స్ కు . మరో వంద రోజుల్లో తమ అభిమాన హీరో పుట్టినరోజు ఉండటంతో ఓ అభిమాని అత్యుత్సాహంతో ట్వీట్ చేసాడు కట్ చేస్తే సిద్దార్థ్ కంట పడి వెటకారం అయ్యింది .

సిద్దార్థ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడన్న విషయం తెలిసిందే . ఈ హీరో కు సరైన హిట్స్ లేక చాలా సంవత్సరాలు అవుతోంది . హిట్ కోసం ఎన్ని సినిమాలు చేసినా పాపం సక్సెస్ అనేది అందని ద్రాక్ష అయ్యింది . ఇక ప్రభాస్ బాహుబలి తో తన ఖ్యాతి ని ప్రపంచ వ్యాపితం చేసుకున్నాడు దాంతో అభిమానులు ఉత్సాహం చూపిస్తున్నారు . ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రం చేస్తున్నాడు . తెలుగు , తమిళ , హిందీ బాషలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది . సిద్దార్థ్ ట్వీట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకోవడం ఖాయం . దానికి సిద్దార్థ్ సమాధానం ఎలా ఇస్తాడో చూడాలి .

English Title: Siddharth insults Prabhas fans