సిద్దార్థ్ సెకండ్ ఇన్నింగ్స్



సిద్దార్థ్ సెకండ్ ఇన్నింగ్స్
సిద్దార్థ్ సెకండ్ ఇన్నింగ్స్

మరి ఆరోజుల్లో సిద్దార్థ్ గారు హీరోగా ఒక వెలుగు వెలిగారు. కాసేపు తను తెలుగు వాడినని,మరికాసేపు తమిళ వాడినని నడిచినంత కాలం “బాబు” గా గౌరవం అందుకున్న సిద్దార్థ్ కి టాలెంట్ చాలా ఉంది. ఇగో కూడా ఎక్కువేనంటూ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. సమంతతో నందినీరెడ్డి తీసిన కాపీ సినిమా జబర్దస్త్ తరువాత సిద్దార్థ్ అసలు తెలుగులో కనపడలేదు. సమంత మాజీ లవర్ కి ఆ తర్వాత నుండే తెలుగులో గ్యాప్ వచ్చింది. అడపా దడపా ఏవో డబ్బింగ్ లు కొట్టి వదులుతున్నా.. సోలో మార్కెట్ లేనే లేదు. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా సినిమాలో ఒక చిన్న పాత్ర వేసినా క్లిక్ కాలేదు. ఇక మనోడికి మిగిలిన ఆప్షన్ విలన్ క్యారెక్టర్ లే. సౌత్ లో విలన్ పాత్రలకు బాగా డిమాండ్ ఉంది.

ఇక ఇప్పుడు సిద్దార్థ్ చూస్తే రెండు పెద్ద సినిమాలు చేస్తున్నాడు. హీరో కాదులే.. భయపడకండి. కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఇండియన్ 2 మరియు రజనీకాంత్ – శంఖం శివ (తమిళంలో సిరుత్తై శివ) కాంబినేషన్ లో వచ్చే సినిమాలో కూడా కీర్తి సురేష్ కి జంటగా కీలక పాత్రలు చేస్తున్నాడు. ఇక వీటికి నెగిటివ్ టచ్ ఉండి ఒప్పుకున్నాడో.? లేక కమల్, రజనీ ల సినిమాలు కాబట్టి అతిధి పాత్రలైనా ఒప్పుకున్నాడో.? తెలియదు కానీ మొత్తానికి 2020లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఇక మీదట జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాడో.? లేక ఇలానే ఉంటాడో.? అసలు అదీ కాకుండా మంచి ముహూర్తం చూసుకుని డైరెక్షన్ మొదలెడతాడో.? వెయిట్ అండ్ సీ.