సైమా అవార్డ్స్ కు నామినేట్ అయిన సినిమాలు ఇవే


SIIMA Awards 2018 List

సైమా అవార్డ్స్ 2018 కి నామినేట్ అయ్యాయి పలు చిత్రాలు అయితే అందులో ఏకంగా 12 కేటగిరీ లలో నామినేట్ అయ్యింది మాత్రం ” బాహుబలి 2” చిత్రం . 12 కేటగిరీ లలో బాహుబలి 2 తరుపున నామినేట్ అయిన వాళ్ళ లిస్ట్ ఇలా ఉంది . ఎస్ ఎస్ రాజమౌళి , ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా , రమ్యకృష్ణ , శోభు యార్లగడ్డ , సుబ్బరాజు ,సత్యరాజ్ , ఎం ఎం కీరవాణి , శివశక్తి దత్తా , సెంథిల్ కుమార్ తదితరులున్నారు . ఇక వీటితో పాటుగా పలు చిత్రాలు పోటీపడుతున్నాయి . ఈ అవార్డుల వేడుక సెప్టెంబర్ 14 , 15 తేదీలలో రెండు రోజుల పాటు దుబాయ్ లో ఘనంగా నిర్వహించనున్నారు .

ఇక మిగతా సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ఖైదీ నెంబర్ 150 , బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి , విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రాలు ఉన్నాయి . భారీ ఎత్తున ఈ వేడుకలు దుబాయ్ లో జరుగనున్నాయి . ఉత్తమ నటుడు కేటగిరీ లలో బాలయ్య , ప్రభాస్ , విజయ్ దేవరకొండ , జూనియర్ ఎన్టీఆర్ , రానా లు పోటీ పడుతున్నారు . బాహుబలి 2 కి ఎన్ని అవార్డులు దక్కుతాయో ? ఉత్తమ నటుడిగా ఎవరు నిలుస్తారో చూడాలి .

English Title: SIIMA Awards 2018 List