సైలెంట్ గా శర్వానంద్ “శ్రీకారం” షూటింగ్..!


Silent shutting in Sharwanand Sreekaram film
Silent shutting in Sharwanand Sreekaram film

రీసెంట్ గా రణరంగం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ బాక్సఫీస్ వద్ద బోర్లా పడ్డాడు.. సుదీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పరాజయం పాలైంది. ఇక శర్వానంద్ విషయానికి వస్తే తమిళంలో ఘనవిజయం సాధించిన “96” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు దిల్ రాజు. ఈ చిత్రంలో శర్వానంద్ హీరోగా సమంత హీరోయిన్ గా నటిస్తోంది.. 50శాతం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం దసరా కానుకగా రిలీజ్ కానుందని తెలిసింది.. ఇదిలా ఉండగా శర్వా ‘శ్రీకారం‘ అనే మూవీలో కూడా నటిస్తున్నాడు.. ఈ చిత్రం సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. కిషోర్ రెడ్డి దర్శకత్వంలో 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఈ చిత్రంలో శర్వానంద్ రైతు పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. తిరుపతి,అనంతపురం, వైజాగ్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న శ్రీకారం చిత్రం డిసెంబర్లో విడుదలకు సన్నద్ధం అవుతోంది..!