ఫ్యాన్స్ ఇంటికి రావొద్దంటూ త‌మిళ హీరో పోస్ట్‌!

simbu requests his fans not to visit his house
simbu requests his fans not to visit his house

త‌మిళ హీరో శింబు అభిమానులు త‌న ఇంటి వ‌ద్ద‌కు రావొద్దంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా విజ్ఞ‌ప్తి చేశారు. త‌ను చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. గ‌త కొంత కాలంగా వ‌రుస ప్రేమాయ‌ణాల‌తో విసుగెత్తిపోయిన శింబు కెరీర్ ప‌క్క‌దారి ప‌ట్టింది. తాజాగా త‌న కెరీర్‌పై దృష్టిసారించిన శింబు ఒక్క‌సారిగా బ‌రువు త‌గ్గ అంద‌రికి షాకిచ్చారు.

గత 12 ఏళ్ల క్రితం శింబు ఎలాంటి మేకోవ‌ర్‌తో స్లిమ్‌గా ఫిట్‌గా వున్నారో అదే రూపానికి వ‌చ్చేశారు. ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల్ని అంగీక‌రిస్తూ ఫ్యాన్స్‌ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. శింబు న‌టించిన `ఈశ్వ‌ర‌న్‌` ఇటీవ‌లే విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించింది. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని తెలుగులో `ఈశ్వ‌రుడు` పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

ఇదిలా వుంటే ఫిబ్ర‌వ‌రి 3న శింబు పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా త‌ను మ‌రో ప్లేస్‌కి వెళుతున్నార‌ట‌. న‌గ‌రంలో తాను వుండ‌టం లేద‌ని, కాబ‌ట్టి అభిమానులు ఎవ్వ‌రూ త‌న ఇంటికి రావొద్దంటూ శింబు అభిమానుల్ని విజ్ఞ‌ప్తి చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.