100 కేజీలున్న హీరో షాకింగ్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌!

simbu stunnig trasformation shocked everyone 
simbu stunnig trasformation shocked everyone

వంద కేజీలున్న త‌మిళ హీరో ఉన్న‌ట్టుండి 30 కేజీలు త‌గ్గిపోయి అంద‌రికి షాకిస్తున్నాడు. ఇంత‌కీ అత‌ని మార్పుకి కార‌ణం ఎవ‌రు? .. డ్రాస్టిక‌ల్ గా ఆ హీరో మార‌డానికి రీజ‌న్ ఏంటీ అన్న‌ది ఇప్ప‌టికు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ హీరో మ‌రెవ‌రో కాదు శింబు. వ‌రుస ప్రేమాయ‌ణాల‌తో త‌మిళ‌నాట టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిన శింబు ఆ మ‌ధ్య భారీగా బ‌రువు పెరిగిన విష‌యం తెలిసిందే.

దాదాపు వంద కేజీల‌కు మించి బ‌రువు పెరిగిన పోయిన ఈ హీరో వున్న‌ట్టుడి షాకింగ్ లుక్‌లోకి మారిపోయాడు. త‌న పాత రూపానికి వ‌చ్చేశాడు. ఈ మార్పు వెన‌క అత‌ని త‌ప‌న, విల్ ప‌వ‌ర్‌, త‌ను మ‌ళ్లీ మామూలు స్థాయికి చేరాల‌న్న శింబు సంకల్పం వుంద‌ని అత‌ని సోద‌రి చెప్ప‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. త‌న‌ని తానుగా మార్చుకునే ప్ర‌య‌త్నంలో శింబు చేసిన క‌ఠోర‌శ్ర‌మ ఫ‌లిత‌మ‌ని శింబు సోద‌రి వెల్ల‌డించింది.

శింబు ప్ర‌స్తుతం `ఈశ్వ‌రుడు` ( ఈశ్వ‌ర‌న్‌) , మానాడు చిత్రాల్లో న‌టిస్తున్నారు. శింబు వున్న‌ట్టుడి పాత రూపానికి ట్రాన్స్‌ఫార్మ కావ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది. ఇటీవ‌ల త్రిష‌, శింబు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శింబు మ‌ళ్లీ పాత రూపానికి ట్రాన్స్ ఫార్మ్ కావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.