టెంపర్ అక్కడ రిలీజ్ అయ్యింది కానీ …..


Simmba bollywood movie review

2015 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే . అవినీతి పరుడైన ఓ పోలీస్ అధికారి చివరకు నీతి నిజాయితీల కోసం ఎలా పోరాడాడు అన్నది కథ . కరెప్టెడ్ పోలీస్ ఆఫీసర్ గా ఎన్టీఆర్ నటన నభూతో నభవిష్యత్ అనే చెప్పాలి . కట్ చేస్తే ఆ సూపర్ హిట్ చిత్రాన్ని బాలీవుడ్ లో ” సింబా ” పేరుతో రీమేక్ చేసారు . హీరోగా రణ్ వీర్ సింగ్ నటించాడు . నిన్ననే విడుదల అయ్యింది కూడా .

ఎన్టీఆర్ స్థాయిలో కాకపోయినా రణ్ వీర్ సింగ్ కూడా బాగానే పోషించాడు ఆ పాత్రని . అయితే కథలో మెయిన్ కంటెంట్ టెంపర్ స్థాయిలో లేకపోవడంతో టెంపర్ స్థాయిలో సింబా హిట్ అవుతుందా ? అన్నది ప్రశ్నగా మారింది . రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన సింబా కు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన పోటీ ఏది లేదు దాంతో ఈ సినిమా విజయం సాధించవచ్చు అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . అయితే ఎన్టీఆర్ స్థాయిలో , టాలీవుడ్ టెంపర్ స్థాయిలో సింబా లేదన్నది మాత్రం వాస్తవం .

English Title: Simmba bollywood movie review