నా బయోపిక్ కు ఆమే కరెక్ట్: పీవీ సింధు


నా బయోపిక్ కు ఆమే కరెక్ట్: పీవీ సింధు
నా బయోపిక్ కు ఆమే కరెక్ట్: పీవీ సింధు ( Image courtesy: పీవీ సింధు)

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సాధించి దేశాన్ని గర్వించేలా చేసిన పీవీ సింధు జీవితం ఆధారంగా బయోపిక్ ను నిర్మించనున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సోను సూద్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్ర కూడా తనే పోషించనుండడం విశేషం.

అయితే సింధు పాత్రకు హీరోయిన్ వేట కొనసాగుతోంది. ఇటీవలే సింధు పాత్ర వేయడానికి సమంత ఆసక్తి చూపించిన సంగతి తెల్సిందే. ఇదిలా ఉంటే మీ బయోపిక్ కు ఎవరైతే సరిపోతారు అని సింధుని మీడియా ప్రశ్నించగా దీపికా పదుకొనె అయితే బాగుంటుంది అని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మరి నిర్మాతలు దీపికాకే మొగ్గు చూపుతారా లేక వేరే హీరోయిన్ ను ఫైనలైజ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.