సంచలన ఆరోపణలు చేసిన సింగర్


Baba Sehgal
Baba Sehgal

ముఖ సింగర్ బాబా సెహెగల్ చిత్ర పరిశ్రమపై సంచలన ఆరోపణలు చేసాడు . రీమిక్స్ పేరిట బాలీవుడ్ లో అలాగే ఇతర బాషా చిత్రాల్లో ఆ పాటలను ఖూనీ చేస్తున్నారని , రీమిక్స్ కి బదులుగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ లకు తమ ప్రతిభ నిరూపించుకునే అవకాశం కల్పించాలని దర్శక నిర్మాతలను కోరుతున్నాడు .

రీమిక్స్ పాటలు చేస్తున్నారు బాగానే ఉంది అయితే ఆ ఫ్లేవర్ మిస్ అవుతోంది దాంతో ఒరిజినల్ పాటని కిల్ చేసిన వాళ్ళం అవుతున్నాం . క్లాసిక్ సాంగ్స్ ని రీమిక్స్ చేయడం తగదు అంటూ హితువు చెబుతున్నాడు బాగా సెహెగల్ . ప్రతిభ వెలుగులోకి రావాలంటే కొత్తగా అవకాశం ఇస్తేనే మంచి మంచి పాటలు వెలుగులోకి వస్తాయని లేదంటే ఇలాగె రీమిక్స్ పేరిట ఖూనీ జరుగుతుందని వాపోతున్నాడు . నిజమే కదా ! రీమిక్స్ పేరిట చేసే పాటలు ఒరిజినల్ ఫ్లేవర్ ని దెబ్బతీస్తున్నాయి మరి .