పుకార్ల‌పై క‌నికా క‌పూర్ స్ట్రాంగ్ రిప్లై!


పుకార్ల‌పై క‌నికా క‌పూర్ స్ట్రాంగ్ రిప్లై!
పుకార్ల‌పై క‌నికా క‌పూర్ స్ట్రాంగ్ రిప్లై!

క‌నికా క‌పూర్‌.. క‌రోనా కార‌ణంగా దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ అయినా పేరిది. క‌రోనా మ‌హ‌మ్మారి విజ‌షంభిస్క‌తున్న వేళ లండ‌న్ నుంచి ముంబై వ‌చ్చింది బాలీవుడ్ సింగ‌ర్‌ క‌నికా క‌పూర్‌. అయితే విదేశాల నుంచి ఇండియా వ‌చ్చిన వారు జ‌నానికి దూరంగా వుండ‌లని, 14 రోజుల పాటు క్వారెంటైన్ కి ప‌రిమితం కావాల‌ని సూచించారు.

అయితే ఆ నిబంధ‌న‌ల్ని లెక్క‌చేయ‌కుండా క‌నికా క‌పూర్ పార్టీల్లో పాల్గొంది. ఆమె పాల్గొన్న పార్టీల్లో వీఐపీలుకూడా పాల్గొన్నారు. కనిక‌తో రాసుకుపూసుకు తిరిగారు. ఆ త‌రువాత కనికకు పాజిటివ్ అని తేల‌డంతో  బాలీవుడ్ వ‌ర్గాల‌తో పాటు ఆమెతో క‌లిసి పార్టీల్లో పాల్గొన్న‌ప వారంతా భ‌యంతో వ‌ణికిపోయారు. త‌మ‌కి క‌రోనా సోకిందేమోన‌ని ఆసుపత్రుల చుట్టూ ఉరుకులు ప‌రుగులు పెట్టారు. అయితే ఆమెతో పార్టీలో పాల్గొన్న వారికి క‌రోనా సోక‌లేద‌ని తేల‌డంతో అంతా ఊప‌రి పీల్చుకున్నారు.

అయితే బాధ్య‌తారాహిత్యంగా క‌నిక వ్య‌వ‌హ‌రించ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీంతో క‌నిక క్వారెంటైన్‌కి వెళ్లిపోయింది. అక్క‌డ ఆమెని ప‌రీశీలించిన డాక్ట‌ర్లు ఐదు సార్లు ప‌రీక్షించినా పాజిటివ్ రావ‌డంతో బాలీవుడ్ వ‌ర్గాల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. తాజాగా నెగెటివ్ రావ‌డంతో ఆమెని డాక్ట‌ర్లు ఇంటికి పంపించేశారు. అయితే ఈ సారి 14 రోజుల పాటు ఇంటి ప‌ట్టునే వుండాల‌ని ఎవ‌రినీ క‌ల‌వ‌రాద‌ని సూచించారు. అయితే క‌నిక మాత్రం ఇంటి నుంచి పారిపోయింద‌ని ప్ర‌చారం మొద‌లైంది. అందులో ఎలాంటి నిజం లేద‌ని, తాను ఇంటి ప‌ట్టునే వుంటున్నాన‌ని క‌నికి త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చింది.