షాకింగ్ విష‌యం చెప్పిన నోయ‌ల్‌!

షాకింగ్ విష‌యం చెప్పిన నోయ‌ల్‌!
షాకింగ్ విష‌యం చెప్పిన నోయ‌ల్‌!

ప్ర‌ముఖ ర్యాప్ సింగ‌ర్‌, న‌టుడు నోయ‌ల్ మంగ‌ళ‌వారం అభిమానుల‌కు, నెటిజ‌న్‌ల‌కు షాకింగ్ న్యూస్ షేర్ చేశారు. త‌ను త్వ‌ర‌లో విడాకులు తీసుకుంటున్నాన‌ని ఓ వార్త‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. నోయ‌ల్ ఏడాది క్రితం హీరోయిన్ ఏస్త‌ర్‌ని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. సునీల్ న‌టించిన `భీమ వ‌రం బుల్లోడు`. తేజ రూపొందించిన `1000 అబ‌ద్ధాలు` చిత్రాల్లో న‌టించింది. ఆ త‌రువాత అవ‌కాశాలు అంత‌గా రాక‌పోవ‌డంతో సినిమాలు దూరంగా వుంటూ వ‌చ్చింది.

నోయ‌ల్‌తో ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డంతో ఇద్ద‌రు క‌లిసి గ‌త ఏడాది వివాహం చేసుకుని షాకిచ్చారు. అయితే గ‌త కొంత కాలంగా ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు మొద‌ల‌య్యాయ‌ట‌. ఆ కార‌ణంగానే తాము విడాకుల‌కు అప్లై చేశామ‌ని, కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నామ‌ని నోయ‌ల్ తాజాగా వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. విడాకుల‌కు అప్లై చేసిన నోయ‌ల్ త‌న నుంచి విడిపోతున్న ఏస్త‌ర్ క‌న్న క‌ల‌లు నిజం  కావాల‌ని, త‌న భ‌విష్య‌త్తు బాగుండాల‌ని కోరుకున్నారు. ఈ విష‌యంలో త‌న కుటుంబాన్ని కానీ, త‌న‌ని, ఏస్త‌ర్‌ని కానీ వేదించొద్దంటూ విజ్ఞ‌ప్తి చేశారు.

విడాకుల అనంత‌రం త‌ను స‌రికొత్త జీవితాన్ని ప్రారంభించ‌బోతున్నాన‌ని, ఈ క‌ష్ట‌కాలంలో త‌న‌కు అండ‌గా నిలిచిన వారికి ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. నోయ‌ల్ త్వ‌ర‌లో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ సీజ‌న్ 4లో ఎంట‌ర్ కానున్నాడంటూ వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో నోయ‌ల్ విడాకులు తీసుకుంటున్నానంటూ ప్ర‌క‌టించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.