టాలీవుడ్ డైరెక్టర్ పై సంచలన ఆరోపణలు చేసిన సింగర్


సింగర్ ప్రణవి టాలీవుడ్ డైరెక్టర్ పై సంచలన ఆరోపణలు చేసింది . పాట పాడే ఛాన్స్ కావాలంటే అతడి కోర్కెలను తీర్చాలని ఓ టాలీవుడ్ డైరెక్టర్ అడిగాడని దాంతో చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చానని ఇక అప్పటి నుండి ఆ దర్శకుడు నాకు ఎప్పుడు ఎదురు పడినా నా కళ్ళలోకి చూడడని …… పక్కనుండి వెళ్ళిపోతాడని సంచలన ఆరోపణలు చేసింది ప్రణవి . తెలుగులో పలు చిత్రాల్లో పాటలు పాడిన ప్రణవి డ్యాన్స్ మాస్టర్ రఘు మాస్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది .

అయితే ఈ సంఘటన ఇటీవల జరిగింది కాదని , నా కెరీర్ మొదట్లో అంటూ అసలు విషయం చెప్పింది . అంతేకాదు ఇలాంటి సంఘటనలు టాలీవుడ్ లో అందునా సింగర్ లకు ఎదురై ఉంటాయని కానీ పరువు పోతుందనో లేక మరో కారణమో కానీ ఎక్కువ మంది చెప్పడం లేదని అంటోంది ప్రణవి . అయితే ఇన్ని మాటలు చెప్పిన ప్రణవి ఆ టాలీవుడ్ డైరెక్టర్ ఎవరో మాత్రం పేరు చెప్పలేదు .