రోడ్డు ప్రమాదంలో గాయని మృతిVidyabalan seducting picture goes viral

పాప్ సింగర్ , బాలీవుడ్ గాయని శివానీ భాటియా  ( 24) మృతి చెందింది . ఆగ్రా లో ఓ ఫంక్షన్ లో పాల్గొనడానికి తన భర్త నిఖిల్ తో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో కారు ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పి బోల్తా పడింది . అయితే శివాని భాటియా కూర్చున్న వైపునే కారు బాగా దెబ్బతినడంతో శివాని భాటియా కు గాయాలయ్యాయి . వెంటనే శివాని భాటియా ని అలాగే ఆమె భర్త నిఖిల్ ని ఆసుపత్రికి తరలించారు.

 

అయితే గాయాలు ఎక్కువ కావడంతో చికిత్స పొందుతూ నిన్న చనిపోయిందని పోలీస్ ఉన్నతాధికారి ప్రకటించాడు . శివాని భర్త ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు . శివాని భాటియా చనిపోయిందన్న విషయం బాలీవుడ్ లో తెలియడంతో పలువురు షాక్ అయ్యారు . శివాని మృతికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు .

English Title: Singer Shivani bhatia died in car accident