ఆస్ట్రాల‌జీ ప్ర‌కారం చాలా ప్ర‌మాద‌క‌రం:  గాయ‌ని స‌్మిత‌


 

Singer smitha sensational comments on Corona virus
Singer smitha sensational comments on Corona virus

క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని కుదిపేస్తున్న‌ది. దీంతో నివార‌ణ ఒక్క‌టే మార్గ‌మ‌ని, దీనికి మందు లేద‌ని,
సామాజిక దూరం పాటించ‌డ‌మే ఇందుకున్న ఏకైక మార్గ‌మ‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌ని అప్ర‌మ‌త్తం చేశాయి, ఇందు కోసం 21 రోజుల పాటు లాక్ డౌన్‌ని విధించాయి. దీంతో ప‌రిస్థితి కొంత వ‌ర‌కైనా అదుపులోకి వ‌స్తుంద‌ని ఆశ‌. ఇప్పుడు అదే ఫ‌లించేలా క‌నిపిస్తోంది.

కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టించిన లాక్ డౌన్ మ‌రో రెండు వారాల్లో ముగియ‌నుండ‌టంతో ఈ రెండు వారాలే అత్యంత కీల‌క మ‌ని అంతా భావిస్తున్నారు. ఈ స‌మ‌యంలోనే అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. గాయ‌ని స్మిత ఇదే విష‌యాన్ని వెల్ల‌డిస్తూ మీడియాకు ఓ వీడియో సందేశాన్ని విడుద‌ల చేసింది. వ‌చ్చే రెండు వారాలు మ‌న‌కు అత్యంత క్లిష్ట‌మైన రోజులు, వైర‌స్ బాగా వ్యాప్తి చెంద‌డానికి ఆస్కారం వున్న ఈ రోజుల్లో ఎవ‌రూ బ‌య‌టికి రావొద్ద‌ని, ఇంటి ప‌ట్టునే వుండాల‌ని, అలా చేస్తేనే ఈ మ‌హ‌మ్మారిని అరిక‌ట్ట‌వ‌చ్చని చెబుతోంది.

వ‌చ్చే వారం రోజులు మ‌న‌కు అత్యంత కీల‌క‌మ‌ని, వైర‌స్ బాగా వ్యాప్తి చెందే అవకాశం వున్న కాల‌మ‌ని చెబుతోంది. అంతే కాకుండా ఆస్ట్రాల‌జీ ప్ర‌కారం చంద్రుడి మీద‌కు రాహువు వ‌స్తున్నాడు. శ‌ని, అంగార‌కుడు, గురు గ్ర‌హాలు మూడూ క‌లుసుకోబోతున్నాయి. జ్యోతీష్యం ప్ర‌కారం ఇది చాలా ప్ర‌మాద‌క‌రం.
అంటే ఆ స‌మయంలో వైన‌స్ వేగంగా వ్యాప్తిచెంద‌డానికి అవ‌కాశం వుంది. ఈ టైమ్‌లో మ‌నం బ‌య‌ట‌కు
వెళ్ల‌క‌నోవ‌డం చాలా ముఖ్యం. ఈ రోజు (సోమ‌వారం) రాత్రి నుంచి ఏప్రిల్ 2 వ‌ర‌కు బ‌య‌ట‌కు వెళ్లి స‌రుకులు కొన‌డం మానుకుని ఇంట్లో వున్న వాటితో స‌రిపెట్టుకుంటే మంచిది. వేడి నీళ్ల‌లో ప‌సుపు, తుల‌సి, వాము క‌లిపి.. ఆవిరి ప‌ట్టుకుంటే వైర‌స్ రాదు` అని వెల్లడించింది స్మిత‌.