సింగర్ సునీత జంట హ‌నీమూన్ ప్లాన్ చేస్తోందట‌!

సింగర్ సునీత జంట హ‌నీమూన్ ప్లాన్ చేస్తోందట‌!
సింగర్ సునీత జంట హ‌నీమూన్ ప్లాన్ చేస్తోందట‌!

ప్ర‌ముఖ సింగ‌ర్ సునీత మీడియా అధినేత రామ్ వీర‌ప‌నేనిని రెండో వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే త‌న ఇద్ద‌రు పిల్ల‌లు, కుటుంబ స‌భ్యుల అంగీక‌రాంతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట హైద‌రాబాద్ శివారులో వున్న పురాత‌న రామాల‌యంలో సంప్ర‌దాయ బ‌ద్ధంగా వేద‌మంత్రాల మ‌ధ్య వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే.

గ‌త కొంత కాలంగా భ‌ర్త కిర‌ణ్‌తో విడిపోయిన సునీత ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి వేరుగా వుంటోంది. రెండో పెళ్లి గురించి ఎంత మంది చెప్పినా మ‌న‌సు మార్చుకోని సునీత తాజాగా రామ్‌తో రెండో పెళ్లికి సిద్ధం కావ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అయితే త‌న పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోస‌మే తాను రెండో పెళ్లి చేసుకుంటున్నాన‌ని ప్ర‌క‌టించిన సునీత త‌న పిల్ల‌ల అంగీకారంతో రెండో పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది.

త్వ‌ర‌లో కొత్త జంట హ‌నీమూన్ కోసం విదేశాల‌కు వెళ్ల‌బోతున్నార‌ని తెలిసింది. 43 ఏళ్ల సునీత ప్రైవ‌సీ కోసం మాత్ర‌మే తాము హ‌నీమూన్ వెళుతున్న‌ట్టు తెలిపిన‌ట్టు తెలిసింది. హ‌నీమూన్‌కి వెళ్లే ముందు ఇండ‌స్ట్రీలో త‌న‌కు అత్యంత స‌న్నిహితులైన వారికి ప్ర‌త్యేకంగా పార్టీని అరేంజ్ చేస్తున్నార‌ట‌. ఆ త‌రువాతే ఈ జంట హ‌నీమూన్ వెళ్ల‌నుంద‌ని తెలిసింది.