సింగ‌ర్ సునీత పెళ్లి డేట్ మారింది!


సింగ‌ర్ సునీత పెళ్లి డేట్ మారింది!
సింగ‌ర్ సునీత పెళ్లి డేట్ మారింది!

టాలీవుడ్ పాపుల‌ర్ సింగ‌ర్ సునీత పెళ్లి ప్ర‌స్తుతం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. త‌న భ‌ర్త కిర‌ణ్‌తో కొన్నేళ్ల క్రితం విడిపోయిన సునీత మ‌ళ్లీ పెళ్లి చేసుకోబోతోందంటూ గ‌త కొంత కాలంగా వ‌రుస క‌థ‌నాలు నెట్టింట్లో సంద‌డి చేస్తున్నాయి. గ‌త సోమ‌వారం ఆ వార్త‌ల్ని నిజం చేస్తూ సింగ‌ర్ సునీత‌కు ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. ఓ యూట్యూబ్ చాన‌ల్ అధినేత రామ్‌తో సునీత‌కు ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. ఈ విష‌యం తెలిసి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు షాక్‌కు గుర‌య్యారు.

త‌న రెండో పెళ్లికి పిల్ల‌ల‌తో పాటు త‌ల్లిదండ్రులు కూడా అంగీక‌రించార‌ని వారి భ‌విష్య‌త్తు కోస‌మే తాను రెండ‌వ పెళ్లికి సిద్ధ‌ప‌డ్డాన‌ని, రామ్ త‌న‌కు అన్ని విధాలా త‌గిన వాడ‌ని సునీత సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌‌డించింది. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలని కూడా ఈ సంద‌ర్భంగా సునీత షేర్ చేయ‌డంతో ఆమెపై సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌ల వ‌ర్షం కురిసింది.

ఈ నెల 27నే వివాహః చేసుకోబోతున్నార‌ని వివాహ తేదీని కూడా ప్ర‌క‌టించారు. ఈ పెళ్లికి అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే పాల్గొన‌బోతున్నార‌ని వార్త‌లు కూడా వినిపించాయి. అయితే తాజాగా పెళ్లి డేట్ మారిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది ప్రారంభంలో వీరి పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని తెలిసింది.