పురాత‌న రామాల‌యంలో సింగ‌ర్ సునీత పెళ్లి!

పురాత‌న రామాల‌యంలో సింగ‌ర్ సునీత పెళ్లి!
పురాత‌న రామాల‌యంలో సింగ‌ర్ సునీత పెళ్లి!

ప్ర‌ముఖ పాపుల‌ర్ సింగ‌ర్ సునీత మ్యాంగో మీడియా అధినేత రామ్ వీర‌ప‌నేనిని వివాహం చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని రోజులుగా వార్త‌ల్లో నిలుస్తున్న ఈ జంట ఈ రోజు పెళ్లి చేసుకుంటోంది. కొన్ని రోజుల క్రితం పెద్ద‌ల సాక్షిగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ కొత్త జంట ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌ని జ‌రుపుకుని వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే.

తాజాగా వీరి పెళ్లి హైద‌రాబాద్‌లోని పురాత‌న చ‌రిత్ర గ‌ల శ్రీ‌రామ‌చంద్రుల వారి ఆల‌యంలో జ‌రుగుతున్న‌ట్టు తెలిసింది. గ‌త కొన్నేళ్ల క్రితం భ‌ర్త కిర‌ణ్‌తో విడిపోయి ఇద్ద‌రు పిల్ల‌ల‌తో విడిగా వుంటున్న సునీత మీడియా అధినేత రామ్ వీర‌ప‌నేని ప్ర‌పోజ‌ల్‌ని అంగీక‌రించి అత‌న్ని రెండో పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌ప‌డింది.

ఈ వివాహానికి సునీత‌కు, రామ్‌కు అత్యంత స‌న్నిహితులైన వారు మాత్ర‌మే హాజ‌రు అవుతున్నార‌ట‌. అయితే ప్ర‌ధానంగా దిల్ రాజు ఈ పెళ్లిని ముందుండి జ‌రిపిస్తున్నార‌ని మొద‌టి నుంచి వార్త‌లు షికారు చేస్తున్నాయి. ఆ వార్త‌ల‌కు త‌గ్గ‌ట్టే దిల్ రాజు వీరి వివాహానికి పెద్ద‌గా నిలిచి పెళ్లి జ‌రిపిస్తున్నార‌ట‌. ప‌సుపు పెట్ట‌డం, మెహెందీకి సంబంధించిన ఓ వీడియోని రేణుదేశాయ్ సోష‌ల్ మీడియా ఇన్ స్టా లో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.