సింగర్ సునీత వెడ్డింగ్ డేట్ ఫైన‌ల్‌!


సింగ్ సునీత వెడ్డిండ్ డేట్ ఫైన‌ల్‌!
సింగ్ సునీత వెడ్డిండ్ డేట్ ఫైన‌ల్‌!

ప్ర‌ముఖ పాపుల‌ర్ సింగ‌ర్ సునీత గ‌త కొంత కాలంగా పెళ్లి చేసుకోబోతోందంటూ వార్త‌లు షికారు చేసిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఓ మీడియా అధినేత రామ్ వీర‌ప‌నేనితో సున‌రీత ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సునీత సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. 43 ఏళ్ల ఈ క్రేజీ సింగ‌ర్‌కి ఇప్ప‌టికే ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. గ‌తంలో టీవీ ప్రొడ్యూస‌ర్ కిర‌ణ్‌ని వివాహం చేసుకున్నారు సునీత‌.

ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థం రావ‌డంతో కొన్నేళ్ల క్రితం విడిపోయారు. అప్ప‌టి నుంచి ఒంట‌రిగా వుంటున్న సునీత త్వ‌ర‌లో రామ్ వీర‌ప‌నేని వివాహం చేసుకోబోతోంది. వీరి వెడ్డింగ్‌కి తాజాగా డేట్ ఫిక్స్ చేశారు. జ‌న‌వ‌రి 9న నూత‌న సంవ‌త్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించ‌బోతున్నారు. ముందు డిసెంబ‌ర్ 27నే వివాహం చేసుకోవాల‌ని భావించినా రామ్ త‌ల్లి కార‌ణంగా పెళ్లిని జ‌న‌వ‌రి 9కి వాయిదా వేశారు.

రెండో పెళ్లిలా కాకుండా గ్రాండ్‌గా ఈ వివాహం జ‌ర‌గాల‌ని, సాధార‌ణ వివాహం త‌ర‌హాలోనే బంధు మిత్రులంద‌రినీ పిలిచి గ్రాండ్‌గా వివాహం జ‌ర‌పాల‌ని రామ్ త‌ల్లి నిర్ణ‌యించార‌ట‌. దీంతో ఇరుకుటుంబాల‌కు  చెందిన వాళ్లు సునీత – రామ్‌ల పెళ్లికి ఏర్పాట్ల‌ని మొద‌లుపెట్టిన‌ట్టు తెలిసింది. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు ప్ర‌త్యేకంగా పార్టీ ఇచ్చిన ఈ జంట పెళ్లికి ప్ర‌తీ ఒక్క‌రినీ ఆహ్వానిస్తున్నార‌ట‌.