శిరీష్ త‌న‌యుడి మూవీ టైటిల్ ఫిక్స్‌?

శిరీష్ త‌న‌యుడి మూవీ టైటిల్ ఫిక్స్‌?
శిరీష్ త‌న‌యుడి మూవీ టైటిల్ ఫిక్స్‌?

దిల్ రాజు నిస్సందేహంగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నిర్మాతలలో ఒకరు. అతను రెండు దశాబ్దాలకు పైగా నిర్మాణ‌, పంపిణీ రంగంలో ఉన్నాడు. ఇప్పుడు, అతను నటన రంగంలో కూడా తన కుటుంబం నుంచి ఒక‌రిని ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. అతని త‌మ్ముడి త‌న‌యుడు ఆశిష్ రెడ్డి కొత్త చిత్రంతో హీరోగా అరంగేట్రం చేయబోతున్నాడు.

మేకర్స్ ఈ చిత్ర టైటిల్‌ను `రౌడీ బాయ్స్` అని ఫిక్స్ చేశారు. `హుషారు` ఫేమ్‌ కీర్తి శ్రీ హర్ష ఈ ప్రాజెక్టుకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆశిష్ రెడ్డి దిల్ రాజు సోదరుడు శిరిష్ కుమారుడే.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించే చిత్రాలకు వెన‌కుండి అన్ని చూసుకునేది ఆయ‌నే.

`రౌడీ బాయ్స్` షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని సరైన సమయంలో విడుదల చేసి తన త‌మ్ముడి త‌న‌యుడికి పరిపూర్ణ లాంచ్‌ప్యాడ్‌గా మార్చడానికి భారీగా ప్రచారం చేయాలని దిల్‌ రాజు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.