సెటైర్ ఆ హీరో పైనే వేశాడా


Sirivennela seetharama sastri setires on balakrishna

నిన్న జరిగిన అంతరిక్షం ప్రీ రిలీజ్ వేడుకలో సిరివెన్నెల సీతారామశాస్త్రి పాల్గొన్నారు . పనిలో పనిగా బాలకృష్ణ పై సెటైర్ లు వేసాడు , అయితే నేరుగా బాలయ్య పేరు ఎక్కడా ప్రస్తావించలేదు సిరివెన్నెల కానీ అయన మాట్లాడిన మాటల సారాంశం అయితే నేరుగా బాలయ్యనే తాకుతోంది . విజిల్ కొడితే ట్రైన్ రావడం , గట్టిగా కొడితే భూకంపం రావడం లాంటి సన్నివేశాలు చూసి చూసి విసిగిపోయాం ఇక ఇదేనా తెలుగు సినిమా అని అనుకుంటున్న సమయంలో క్రిష్ , సంకల్ప్ రెడ్డి లు తెలుగు సినిమాని కొత్త ట్రెండ్ కు తీసుకెళ్తున్నారు అంటూ సెలవిచ్చాడు సిరివెన్నెల .

మిగతా హీరోలను పక్కన పెడితే ఈ తరహా డైలాగ్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఎక్కువగా బాలయ్య సినిమాలోనే ఉంటాయి దాంతో సిరివెన్నెల బాలయ్య పై సెటైర్ వేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి . సిరివెన్నెల మాటలను పక్కన పెడితే తెలుగు సినిమా మాత్రం ఆ తరహా యాక్షన్ చిత్రాలనుండి కొత్త తరహా చిత్రాల వైపు పయనిస్తోంది . ఇప్పటికే పలు విభిన్న తరహా చిత్రాలతో కొత్త పుంతలు తొక్కుతున్న టాలీవుడ్ కు అంతరిక్షం వంటి విభిన్న చిత్రంతో మరింత ముందుకు వెళ్లనుంది .

English Title: Sirivennela seetharama sastri setires on balakrishna