సితార ఎంటర్టైన్మెంట్స్ దూకుడు మాములుగా లేదుగా


sitara entertainments busy with half a dozen
sitara entertainments busy with half a dozen

2016లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కు అనుబంధంగా సితార ఎంటర్టైన్మెంట్స్ ను స్థాపించాడు నిర్మాత ఎస్ రాధాకృష్ణ. సితార ఎంటర్టైన్మెంట్స్ బాధ్యతను సూర్యదేవర నాగ వంశీ టేకోవర్ చేసుకున్నాడు. మొదటి సినిమాగా బాబు బంగారం నిర్మించాడు. అది ప్లాపైంది. అయితే నాగచైతన్యతో చేసిన ప్రేమమ్ మాత్రం హిట్టైంది. 2018లో మళ్ళీ నాగ చైతన్యతోనే చేసిన శైలజారెడ్డి అల్లుడు ప్లాప్ సినిమాగా మిగిలింది. మళ్ళీ గ్యాప్ తీసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ 2019లో జెర్సీ సినిమాను నిర్మించగా అది వర్కౌట్ అయింది. కమర్షియల్ గా అనుకున్నంత రేంజ్ కు వెళ్లకపోయినా ఒక మంచి సినిమాను నిర్మించిన గౌరవం దక్కింది. అదే ఏడాది రణరంగం రూపంలో మరో ప్లాప్ వచ్చింది.

అయితే ఈ ఏడాది సితార ఎంటర్టైన్మెంట్స్ దూకుడు పెరిగింది. వరస సినిమాలను సెట్ చేస్తున్నాడు నిర్మాత వంశీ. ఇప్పటికే నితిన్ తో భీష్మ చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు మళ్ళీ నితిన్ తోనే రంగ్ దే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా జులైలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. న్యాచురల్ స్టార్ నానితో శ్యామ్ సింగ రాయ్ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని కూడా ప్రకటించాడు. ఈ సినిమా షూటింగ్ జూన్ నుండి మొదలయ్యే అవకాశముంది. ఇక నాగ శౌర్య హీరోగా కొత్త దర్శకురాలు లక్ష్మి సౌజన్య తెరకెక్కిస్తోన్న సినిమాకి వంశీనే నిర్మాత. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు కూడా డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. మరో రెండు నెలలు ఆగితే వాటిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

ఇప్పుడు ఈ చిత్రాలు కాకుండా మలయాళ సినిమా రీమేక్ ను కూడా కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌ చిత్రాన్ని కూడా తెలుగులో రీమేక్ చేయనున్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం. నడుస్తున్నాయి పైన చెప్పుకున్న సినిమాలు అన్నీ ఇదే ఏడాది విడుదల కానుండడం విశేషం.