నితిన్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోన్న సితార.. ఎందుకు?


నితిన్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోన్న సితార.. ఎందుకు?
నితిన్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోన్న సితార.. ఎందుకు?

ఏదైనా నిర్మాణ సంస్థ ఒక హీరోతో మల్టీపుల్ సినిమాల డీల్స్ చాలా చేస్తుంటారు. దిల్ రాజు, సురేష్ బాబు వంటి వారు ఇలాంటి డీల్స్ ఎన్నో చేసారు. ఎవరైనా హీరో ప్రామిసింగ్ గా అనిపిస్తే అతనితో మూడు, నాలుగు సినిమాల డీల్స్ చేసుకుంటారు. అయితే ఇలాంటి డీల్స్ లో ఒక సినిమా విడుదలయ్యాక మరో సినిమా షురూ చేస్తారు కానీ ఒక సినిమా నిర్మాణంలో ఉండగానే మరో సినిమా మొదలుపెట్టింది లేదు.

సితార ఎంటర్టైన్మెంట్స్ మాత్రం ఇదే చేస్తోంది. నితిన్ తో రెండు సినిమాల డీల్ ఉంది సితారకి. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార నిర్మాణంలో భీష్మ చేస్తున్నాడు నితిన్. ఈ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. డిసెంబర్ కు రిలీజ్ అంటున్నారు కానీ అది జనవరికో, ఫిబ్రవరికో షిఫ్ట్ అవ్వడం ఖాయం.

అయితే ఈ సినిమా ఇంకా షూటింగ్ లో ఉండగానే నితిన్ నెక్స్ట్ సినిమా రంగ్ దే, వెంకీ అట్లూరి దర్శకత్వంలో మొదలైపోయింది. దీనిని కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థే నిర్మిస్తోంది. ఇలా ఒక సినిమా ప్రొడక్షన్ లో ఉండగానే మరో సినిమా ఎందుకింత హడావిడిగా మొదలుపెట్టేసారు అని చాలామంది సందేహించారు. దానికి కారణాలు.. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తవ్వడం, ఇతర నటీనటుల డేట్స్ అందుబాటులో ఉండడం వంటివి. అందుకే మరో ఆలోచన లేకుండా ఈ సినిమాను పట్టాలెక్కించేసారు.