సిత్తరాల సిరపడు బయటకు వచ్చేసాడుSittharala Sirapadu Lyrical From Ala Vaikunthapurramuloo released
Sittharala Sirapadu Lyrical From Ala Vaikunthapurramuloo released

ఒక కవి అయినా ఒక రచయిత అయిన గొప్ప పాట గొప్ప కథ రాసినప్పుడు సక్సెస్ అయినట్లు కాదు.  తాము రాసిన రచనలలో ఉన్న  అర్ధాన్ని అంతరార్థాన్ని అతి సామాన్యమైన ప్రజలకు కూడా  అర్థం చేసుకునే విధంగా దగ్గర చేయగలిగినప్పుడే వారు నిజంగా విజయం సాధించినట్లు. ఒక సినిమా విషయంలో కూడా దర్శకుడు ప్రేక్షకులను కేవలం రెండున్నర గంటల పాటు ఆనందింప చేయడం మాత్రమే కాదు;  తాము చెప్పే కథతో ప్రేక్షకులు ప్రయాణం చేయాలి. ఆ కథ లో ఉన్నటువంటి అంతరార్ధాన్ని తమతో పాటు ఇంటికి తీసుకెళ్లాలి. తమ రోజువారీ జీవితంలో ఆ సినిమా తాలూకు మంచితనం, చలాకీతనం, నిజజీవిత పాత్రలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే ఆ సినిమా పాత్రలతో కూడా ప్రయాణం చేయాలి.  అప్పుడే ఆ సినిమా నిజంగా హిట్ అయినట్లు లెక్క.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాల గురించి చెప్పాలంటే ఆయన రచయితగా పనిచేసిన, దర్శకత్వం వహించిన కథలు, సినిమాలు, ఆ పాత్రలు అందులో చూపించే ఫిలాసఫీ మనతోపాటు ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. మనం గతంలో చెప్పుకున్నట్లుగా మన పురాణ ఇతిహాసాలలో ఉండేటటువంటి ఎంతో అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఈతరం జనరేషన్ కూడా అర్థం చేసుకునే విధంగా సినిమాలో చూపిస్తాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తాజాగా అల వైకుంఠపురం సినిమాలో సస్పెన్స్ గా దాచిపెట్టిన, పాట  “సిత్తరాల సిరపడు” ప్రస్తుతం యూత్ లో హల్ చల్ చేస్తోంది. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే హై ఫై బ్యాచ్ దగ్గర నుండి,  మన ఊర్లో బొడ్రాయి దగ్గర కూర్చుని మాట్లాడుకునే యూత్ వరకు ఈ పాట గురించే డిస్కషన్.

అంతగా ఈ పాట ఎందుకు జనాలకి నచ్చింది అంటే, ఈ పాట అర్థం, ఈ పాటలో దాగి ఉన్న అంతరార్థం అసలు ఇలాంటి పాటని సినిమాలో  వాడిన సందర్భం,  ఇలా అన్నీ కలిసి ఈ పాటను పెద్ద హిట్ చేశాయి. ఈ పాటని ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు అఫీషియల్ గా ఇప్పుడే రిలీజ్ చేశారు. ఇక చూడండి ఎఫ్ఎం రేడియో, టిక్ టాక్ , సెల్ఫీ వీడియో, వాట్సప్, ఫేస్ బుక్ అంటూ మొదలు పెడితే ఇంకొక నెల రోజుల పాటు ఈ పాట ఎక్కడికెళ్లినా వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటను రాసిన రచయిత విజయ్ కుమార్ భల్లా గారిని, అద్భుతంగా పాడిన సూరన్న గారిని ప్రేక్షకులు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి

అసలు ఈ పాట అర్థం మనం సినిమాల్లో చూశాం. కానీ ఈ పాట గొప్పతనం, ఈ పాట వెనక అంతరార్థం, ఈ పాట రాసిన రచయిత యొక్క అంతరంగం అసలు ఇలాంటి పాటని మన గురూజీ ఈ సినిమాలో ఇప్పుడు ఎందుకు తీసుకు వచ్చాడు.? అనేది మళ్ళీ వివరంగా మాట్లాడుకుందాం.