షాకిస్తున్న `ఆర్ ఆర్ ఆర్‌` డిజిట‌ల్ రైట్స్‌!


షాకిస్తున్న `ఆర్ ఆర్ ఆర్‌` డిజిట‌ల్ రైట్స్‌!
షాకిస్తున్న `ఆర్ ఆర్ ఆర్‌` డిజిట‌ల్ రైట్స్‌!

చ‌రిత్ర‌లో నిలిచిపోయిన ఇద్ద‌రు యోధులు అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీం. ఈ ఇద్ద‌రు కొంత కాలం క‌నిపించ‌కుండా పోయారు. ఆ స‌మ‌యంలో వీరు ఏం చేశారు? ఎక్క‌డున్నారు?. మ‌ళ్లీ ఎలా బ‌య‌టికి వ‌చ్చారు? అనే అంశాల‌కు ఫిక్ష‌న‌ల్ అంశాల్ని జోడించి రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై స‌ర్వ‌త్రా భారీ అంచ‌నాలున్నాయి.

టాలీవుడ్ క్రేజీ స్టార్స్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్న చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌న్‌, అలియాభ‌ట్‌, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్‌స‌న్, ఒలివియా మోరీస్‌, అలీస‌న్ డూడీ, త‌మిళ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 150 కోట్ల‌తో ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ స‌న్నివేశాల్ని న‌భూతో న‌భ‌విష్య‌తి అనే స్థాయిలో చిత్రీక‌రిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్ర‌క‌ర‌ణ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది.

ఇదిలా వుంటే ఈ చిత్ర డిజిట‌ల్ రైట్స్‌ని భారీ మొత్తానికి స్టార్ ఇండియా ప‌రివార్ సంస్థ కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది. తెలుగుతో పాటు ఈ చిత్రాన్ని మొత్తం 10 ప్ర‌ధాన భార‌తీయ భాష‌ల్లో రీలీజ్ చేయాల‌ని రాజ‌మౌళి ప్లాన్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ ప‌ది భాష‌ల‌కు చెందిన డిజిట‌ల్ రైట్స్‌ని స్టార్ ఇండియా పరివార్ సంస్థ 250 కోట్ల‌కు ద‌క్కించుకున్న‌ట్టు తెలిసింది. ఒక తెలుగు సినిమా డిజిట‌ల్ హ‌క్కుల్ని ఈ స్థాయిలో అమ్మ‌డం భార‌తీయ సినీ చ‌రిత్ర‌లోనే ఓ రికార్డుగా చెబుతున్నారు. రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తుంటే రిలీజ్ త‌రువాత `ఆర్ ఆర్ ఆర్` హిస్ట‌రీ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.