నిద్ర, కౌగిలింతలు నన్ను సంతోషపరుస్తాయి : శృతిహాసన్

Sleep and hugs make me happy Shruti Haasan
Sleep and hugs make me happy Shruti Haasan

క‌రోనా మహమ్మారి కారణంగా నటులు అభిమానులతో చురుకుగా సంభాషించడానికి, వారి సినిమాలను ప్ర‌మోట్ చేసుకోవ‌డానికి ఆన్‌లైన్ ని వాడుకుంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ‘క్రాక్’ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సొంతం చేసుకుంది శృతిహాస‌న్‌. తాజాగా పవన్ కళ్యాణ్ మూడేళ్ల విరామం త‌రువాత న‌టించిన‌ ‘వకీల్ సాబ్’ లో అతిథి పాత్రలో కనిపించింది. ఇటీవ‌లే విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని సొంతం చేసుకుంతోంది.

ఈ సంద‌ర్భంగా శృతి హాసన్, ట్విట్టర్‌లో తన అభిమానులతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించింది. సుదీర్ఘ చిట్ చాట్ లో పాల్గొంది. వ్యక్తిగత జీవితంలో ఆమెకు ఇష్టమైన ఆహారం, ఇష్టమైన ఆటలు, ఇతర విషయాల గురించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు శృతి చాలా ఓపికగా సమాధానం ఇచ్చింది. అభిమానులతో  ఆసక్తికరమైన విషయాల‌ని పంచుకుంది.

పాఠశాల రోజుల్లో క్రష్ గురించి మాట్లాడుతూ ` హృతిక్ రోషన్, లియోనార్డో డికాప్రియోలంటే క్ర‌ష్ వుండేదిన తెలిపింది. మీరు చేసే విచిత్రమైన పని గురించి అడిగితే నాతో చాలా మాట్లాడతాను అని చెప్పింది. మీకు సంతోషాన్నిచ్చే మూడు విషయాల గురించి చెప్ప‌మ‌ని అడిగితే…నిజం, నిద్ర, కౌగిలింతలు అంటే అమితంగా ఇష్ట‌ప‌డ‌తాన‌ని చెప్పింది శృతిహాస‌న్‌.