స‌మంత మూడేళ్లుగా గ‌ర్భ‌వ‌తా?


Smantha terrific punch on netizen
Smantha terrific punch on netizen

క్రేజీ హీరోయిన్ స‌మంత సోష‌ల్ మీడియాలో య‌మ యాక్టీవ్‌గా వుంటుందన్న విష‌యం తెలిసిందే. నెటిజ‌న్‌ల‌తో చాటింగ్ చేస్తూ తెలివిగా స‌మాధానాలు చెబుతుంటుంది. కొన్ని కొన్ని సార్లు సెటైర్లు , పంచ్‌లు కూడా వేస్తుంటుంది. తాజాగా ఓ నెటిజ‌న్‌కి స‌మంత అదిరిపోయే పంచ్ వేసింది. తాజాగా స‌మంత `ఆస్క్ స‌మంత‌` పేరుతో అభిమానుల‌తో ఓ చాటింగ్ సెష‌న్‌ని నిర్వ‌హించింది.

ఇక ఈ సెష‌న్‌లో సామ్ అభిమానులు, నెటిజ‌న్‌లు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఓపిగ్గా స‌మాధానాలు చెప్పింది. అయితే ఇటీవ‌ల వ‌రుస‌గా బాలీవుడ్ హీరోయిన్‌లు ప్రెగ్నెన్సీని క‌న్ఫ‌మ్ చేస్తూ ఆ వార్త‌ల్ని ఇన్ స్టా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంటున్నారు. ఇటీవ‌ల క‌రీనా క‌పూర్‌, అనుష్క శ‌ర్మ గుడ్ న్యూస్‌ని అభిమానుల‌తో షేర్ చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ఓ నెటిజ‌న్ స‌మంత‌ని మ‌రి మీరు ఎప్పుడు త‌ల్లి కాబోతున్నార‌ని ప్ర‌శ్నించార‌ట‌. దీనికి స‌మంత చెప్పిన స‌మాధానం విని అంతా నోరెళ్ల‌బెట్టిన‌ట్టు తెలిసింది.

తాను 2017లోనే గ‌ర్భ‌వ‌తిని అయ్యాన‌ని, అయితే బేబీ బ‌య‌ట‌కు రావ‌డం లేద‌నుకుంటా` అని తెలివిగా పంచ్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. స‌మంత సెన్సాఫ్ హ్యూమ‌ర్‌ని గ‌మ‌నించిన వారంతా ఘొల్లున న‌వ్వుకుంటున్నారు. స‌మంత ఇటీవ‌లే `ఫ్యామిలీ మ్యాన్ 2`కు డ‌బ్బింగ్ చెప్ప‌డం మొద‌లుపెట్టింది. ఆ విష‌యాన్ని ఇటీవ‌లే ఇన్ స్టా వేదిక‌గా బ‌య‌ట‌పెట్టిన విష‌యం తెలిసిందే.