మళ్ళీ తల్లి కాబోతున్న హీరోయిన్


Sneha and Prasanna
Sneha and Prasanna

హీరోయిన్ స్నేహ తమిళ నటుడు ప్రసన్న ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . ఆ ఇద్దరికీ ఒక కొడుకు ఉన్నాడు కాగా మళ్ళీ ఇప్పుడు స్నేహ తల్లి కాబోతోంది . ప్రస్తుతం గర్భం దాల్చానని , త్వరలోనే మా ఇంట్లోకి మరో అథితి రాబోతున్నారని తెలిపింది సంతోషంగా . స్నేహ తల్లి కాబోతున్న విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు , కుటుంబ సభ్యుల అభినందనలతో , పలకరింపులతో పులకించిపోతోంది స్నేహ .

తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది స్నేహ , తెలుగులోనే కాకుండా తమిళ చిత్రాల్లో కూడా నటించింది . ఇక ప్రసన్న కూడా తెలుగు , తమిళ చిత్రాల్లో నటించాడు , నటిస్తూనే ఉన్నాడు . ఈ ఇద్దరూ 2012 లో పెళ్లి చేసుకున్నారు కాగా వీళ్లకు నాలుగేళ్ళ కొడుకు ఉన్నాడు . ఇప్పుడు మరో బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో చాలా సంతోషంగా ఉన్నారు స్నేహ – ప్రసన్న .