ఈ హీరో ని చాలామంది మోసం చేశారట


so many people cheated me says actor jagapatibabuనేను ఆర్ధికంగా నష్టపోవడానికి కారణం పేకాట ఆడటం అని అనుకున్నారు అలాగే నన్ను ఫోకస్ చేసారు కానీ నేను నష్టపోయింది పేకాట ఆడటం వల్ల కాదు చాలామంది నిర్మాతలకు డబ్బులు ఇవ్వడం వల్లే అని అంటున్నాడు జగపతిబాబు . ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన జగపతిబాబు ఫ్యామిలీ చిత్రాల హీరోగా మంచి గుర్తింపు పొందాడు . శోభన్ బాబు తర్వాత అంతటి ఇమేజ్ ని జగపతిబాబు పొందాడు .

అయితే అప్పట్లో ఈ హీరో తో కొంతమంది సినిమాలు చేసి ఆర్ధికంగా నష్టపోయారట ! సదరు నిర్మాతలు వచ్చి జగపతిబాబు దగ్గర నష్టపోయామని చెప్పడంతో కొంతమంది కి డబ్బులు ఇచ్చాడట మరికొంతమందికి వాళ్ళు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ని ఇవ్వొద్దని చెప్పాడట అలా మోసపోయానని , నష్టపోయానని అంతేకాని పేకాట ఆడి కాదని అంటున్నాడు . అంతేకాదు ఆర్ధికంగా నష్టపోయిన సమయంలో డబ్బు విలువ ఏంటో తెలుసుకున్నానని అందుకే ఇప్పుడు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నానని కూడా చెప్పాడు జగపతిబాబు .