కమర్షియల్ హీరోకు సాఫ్ట్ టైటిల్


Soft title for commercial hero

బెల్లంకొండ సాయి శ్రీనివాస్కాజల్ అగర్వాల్ జంటగా తాజాగా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం లో నటిస్తున్నారు . సినిమా కూడా దాదాపుగా పూర్తికావచ్చింది . ఈ చిత్రానికి టైటిల్ ఇంకా నిర్ణయించలేదు కానీ తాజాగా కాజల్ అగర్వాల్ ఈ విషయాన్నీ చెప్పేసింది దర్శక నిర్మాతల ప్రమేయం లేకుండానే . ఇంతకీ కాజల్ అగర్వాల్ చెప్పిన టైటిల్ ఏంటో తెలుసా ……. సీత . ఇంకా అధికారికంగా ఈ టైటిల్ ని ప్రకటించాల్సి ఉంది కానీ ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన కాజల్ అక్కడ సీత టైటిల్ ని రివీల్ చేసింది .

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కమర్షియల్ హీరో , కమర్షియల్ హిట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు . అయితే అలాంటి హీరోకు సాఫ్ట్ టైటిల్ ఏంటి ? అన్న అనుమానం రాకమానదు . కమర్షియల్ హీరో -సాఫ్ట్ టైటిల్ మాట ఎలా ఉన్నప్పటికీ తేజ అయినా హిట్ ఇస్తాడా ? అని ఆశగా ఎదురు చూస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ . ఈ హీరో ఇప్పటివరకు సాలిడ్ హిట్ కొట్టలేకపోయాడు మరి .

English Title: Soft title for commercial hero