`సోలో బ్ర‌తుకే సోబెట‌ర్` థియేట‌ర్లోకి వ‌చ్చేస్తోంది‌!


`సోలో బ్ర‌తుకే సోబెట‌ర్` థియేట‌ర్లోకి వ‌చ్చేస్తోంది‌!
`సోలో బ్ర‌తుకే సోబెట‌ర్` థియేట‌ర్లోకి వ‌చ్చేస్తోంది‌!

గ‌త ఏడెనిమిది నెల‌లుగా లాక్‌డౌన్ కార‌ణంగా ఫిల్మ్ ఇండ‌స్ట్రీ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. థియేట‌ర్లు కూడా మూత‌ప‌డ‌టంతో రిలీజ్‌కు సిద్ధ‌మైన చిత్రాల నిర్మాత‌లు థియేట‌ర్లు ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారా అని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు థియేట‌ర్లు డిసెంబ‌ర్ నుంచి రీ ఓపెన్ కాబోతున్నాయి. ఈ నేప‌థ్యంలో మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్ చిత్రం విడుద‌ల కాబోతోంది.

సాయి ధ‌ర‌మ్‌తేజ్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌`. సుబ్బు ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ముందు ఈ చిత్రాన్ని జీ5లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో థియేట‌ర్లోనే విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశారు.

డిసెంబ‌ర్‌లో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ బుధ‌వారం స్ప‌ష్టం చేశారు. నిర్మాత భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్‌తో పాటు జీ స్టూడియోస్ కూడా ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌డంతో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజ్ లాంఛ‌న‌మే అని తెలుస్తోంది. అన్ లాక్ ప్ర‌క్రియ‌లో భాగంగా థియేటర్లు రీఓపెన్ ఆక‌నున్న నేప‌థ్యంలో థియేట‌ర్ల‌లో రిలీజ్ కానున్న తొలి సినిమాగా `సోలో బ్ర‌తుకే సో బెల‌ర్‌` నిల‌వ‌బోతోంది.