సోలోతో సోలోగా థియేట‌ర్లోకి మెగాహీరో‌!


సోలోతో సోలోగా థియేట‌ర్లోకి మెగాహీరో‌!
సోలోతో సోలోగా థియేట‌ర్లోకి మెగాహీరో‌!

గ‌త ఏడు నెలలుగా లాక్‌డౌన్ కార‌ణంగా మూత‌ప‌డిన థియేట‌ర్స్ ఈ నెల 15 నుంచి రీఓపెన్ చేసుకోవ‌చ్చ‌ని కేంద్ర ప్ర‌భుత్వం శ‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ప‌రిస్థితులు ఇంకా అలాగే వున్నాయి కాబ‌ట్టి ఎగ్జిబిటర్స్ ఇంకా ఎలాంటి నిర్ణాయానికి రాలేక‌పోతున్నారు. ఆంధ్రాలో ఇప్ప‌టికే మ‌ల్టీప్లెక్స్‌లు తెరిచేశారు.

సింగిల్ థియేట‌ర్స్ ఇంకా స‌స్పెన్స్ మెయింటైన్ చేస్తూనే వున్నాయి. వైజాగ్‌లో ఇటీవ‌లే మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్స్ రీఓపెన్ అయ్యాయి. నితిన్ న‌టించిన `భీష్మ‌` చిత్రాన్ని ప్ర‌ద్శించ‌డం మొద‌లుపెట్టారు కూడా. ఇక తెలంగాణ‌లో మాత్రం ఇంత వ‌ర‌కు ఏ థియేట‌ర్ ఓపెన్ చేయ‌లేదు. న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్‌లో ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోని మ‌ల్టీప్లెక్స్‌ల‌తో పాటు సింగిల్ స్క్రీన్‌లు కూడా తెర‌వ‌బోతున్నారు.

ఈ నేప‌థ్యంలో మెగా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ న‌టిస్తున్న `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌` రిలీజ్ కానున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో థియేట‌ర్‌లో రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ నిర్ణ‌యించుకున్నార‌ట‌. దీంతో ఏడు నెల‌ల విరామం త‌రువాత థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతున్న తొలి సినిమాగా `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌` నిల‌వ‌బోతోంది.