సాయిధ‌ర‌మ్‌తేజ్ మ‌ళ్లీ హిట్టు కొట్టేలా వున్నాడే!సాయిధ‌ర‌మ్‌తేజ్ మ‌ళ్లీ హిట్టు కొట్టేలా వున్నాడే!
సాయిధ‌ర‌మ్‌తేజ్ మ‌ళ్లీ హిట్టు కొట్టేలా వున్నాడే!

`సుప్రిమ్‌` మూవీ త‌రువాత వ‌రుస ఫ్లాప్‌ల‌ని ఎదుర్కొన్న సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు ఇటీవ‌ల వ‌చ్చిన `చిత్ర ల‌హ‌రి` చిత్రంతో ఊర‌ట ల‌భించింది. ఇక `ప్ర‌తిరోజు పండ‌గే` చిత్రం సూప‌ర్‌హిట్ గా నిల‌వ‌డంతో సాయిధ‌ర‌మ్‌తేజ్ స‌క్సెస్ ట్రాక్ ఎక్కేశాడు. అదే ఊపుతో `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌` చిత్రాన్ని చేస్తున్నాడు. భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. సింగిల్‌గా వుండ‌ట‌మే సోబెట‌ర్ అనే స్లోగ‌న్‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సింగిల్స్ అంథెమ్ వీడియోని వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా  హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేశారు. `సింగ‌ల్ సోద‌ర‌సోద‌రీమ‌ణులారా…ఇది మ‌న ఫీలింగ్‌.. మిగ‌తా వాళ్లు వాలెంటైన్స్‌డేని సెల‌బ్రేట్ చేసుకోవ‌చ్చు… అంటూ సింగిల్ అంథెమ్ వీడియోని షేర్ చేశాడు. న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. రిలీజ్ చేసిన తొలి సింగిల్ హీరో సాయి ధ‌ర‌మ్‌తేజ్ మాట‌ల‌తో మొద‌లై సింగిల్స్‌కి ఓ స్లోగ‌న్‌గా సాగింది.

ఈ సింగిల్ వీడియోలో సాయిధ‌ర‌మ్‌తేజ్ స్పీచ్ ఇస్తుండ‌గా వెన‌కాల చ‌రిత్ర‌లో బ్యాచ్‌ల‌ర్స్‌గా మిగిలిపోయిన వాజ్‌పేయి, ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి, మ‌ద‌ర్‌థెరిసా, అబ్దుల్ క‌లామ్, ల‌తా మంగేష్క‌ర్‌ వంటి వారి ఫొటోల‌ని వాడుకున్నారు. సింగిల్ స్లోగ‌న్ థీమ్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో హీరో ఎస్ బి ఎస్ క్ల‌బ్‌ని న‌డిపిస్తున్న‌ట్టు అక్క‌డున్న వారు ప్ర‌ద‌ర్శిస్తున్న‌ ప్లాకార్డుల ఆధారంగా అర్థ‌మ‌వుతోంది. మే 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌బోతున్నారు.