బాలీవుడ్ హీరోయిన్‌ని దించేస్తున్నారా?


బాలీవుడ్ హీరోయిన్‌ని దించేస్తున్నారా?
బాలీవుడ్ హీరోయిన్‌ని దించేస్తున్నారా?

గ‌త రెండేళ్లుగా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్నారు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్. తాజాగా ఆయ‌న బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` ఆధారంగా తెలుగులో రీమేక్ అవుతున్న చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. డేస్‌ని వేస్ట్ చేయ‌కుండా జెట్ స్పీడుతో షూటింగ్ చేస్తున్నారు. దిల్ రాజుతో పాటు బోనీక‌పూర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా వుంటే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఈ సినిమాతో పాటు మ‌రో పిరియాడిక‌ల్ చిత్రాన్ని కూడా చేస్తున్న విష‌యం తెలిసిందే. క్రిష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ దారుణంగా ఫ్లాప్ కావ‌డంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ క్రిష్ తాజా చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్‌నిసొంతం చేసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 29న అల్యూమినియం ఫ్యాక్ట‌రీ ప‌రిస‌రాల్లో మూహూర్తం జ‌రిపి ఆ త‌రువాత రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్టాల‌న్న‌ది క్రిష్ ఆలోచ‌న‌. ప‌వ‌న్ కూడా త‌క్కువ డేట్స్ కేటాయించ‌డంతో మ‌రింత ప‌క్కాగా ఈ సినిమా షెడ్యూల్‌ని క్రిష్ ప్లాన్ చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఓ బందిపోటు దొంగ క‌థ నేప‌థ్యంలో పిరియాడిక్ ఫిల్మ్‌గా ఈ సినిమా రూపొంద‌బోతోంది. ఇందులో ప‌వ‌న్‌కు జోడీగా ఇద్ద‌రు క‌థానాయిక‌లు న‌టిస్తార‌ట. ఇప్ప‌టికే ఓ నాయిక‌గా ప్ర‌గ్యా జైస్వాల్ పేరు వినిపిస్తోంది. తాజాగా మెయిన్ హీరోగా బాలీవుడ్ భామ సొనాక్షి సిన్హా న‌టించే అవ‌కాశం వుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై చిత్ర బృందం ఇంకా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.