పికాక్‌ సుంద‌రి ఫ్లైయింగ్ కిస్‌!


పికాక్‌ సుంద‌రి ఫ్లైయింగ్ కిస్‌!
పికాక్‌ సుంద‌రి ఫ్లైయింగ్ కిస్‌!

ఈ మ‌ధ్య హీరోయిన్‌లు సినిమాల కంటే సోష‌ల్ మీడియా ద్వారానే ఎక్కువ‌గా పాపుల‌ర్ అవుతున్నారు. త‌మ అభిరుచికి త‌గ్గ‌ట్టుగా క‌నిపించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. వ‌రుస ఫొటో షూట్‌ల‌తో ర‌చ్చ చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. తాజాగా అస్లీ సోనా అంటూ సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో సంద‌డి చేస్తున్న సోనాక్షీ సిన్హా తాజాగా షేర్ చేసిన ఓ ఫొటో నెటిజ‌న్స్‌ని విప‌ర‌తంగా ఆక‌ట్టుకుంటోంది.

గ‌త కొంత కాలంగా క్రేజీ ఆఫ‌ర్లు లేక‌పోవ‌డంతో బాలీవుడ్ నాయిక‌ల రేస్‌లో వెన‌క‌బ‌డిన సొనాక్షి ఇటీవ‌ల `ద‌బాంగ్ 3`తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. స‌ల్మాన్‌ఖాన్ హీరోగా ప్ర‌భుదేవా రూపొందించిన ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఈ సినిమాతో మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ కావాల‌ని ఆశ‌లు పెట్టుకున్నా అవి ఏ మాత్రం నెర‌వేర‌లేదు. ప్ర‌స్తుతం అజ‌య్ దేవ‌గ‌న్ న‌టిస్తున్న `భుజ్‌: ద‌ ప్రైడ్ ఆఫ్ ఇండియా` చిత్రంతో పాటు ఓ వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది.

ఇదిలా వుంటే సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో సోనాక్షి సిన్హా పీకాక్ స్టైల్లో డిజైన్ చేయించుకున్న డ్రెస్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారింది. ఈ డ్రెస్‌లో హోయ‌లొలికించిన సోనాక్షి త‌న అభిమానుల‌కు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సోనాక్షి ఫ్లైయంగ్ కిస్ ఇస్తున్న ఓ ఫొటో ప్ర‌స్తుతం ఇన్‌స్టాలో వైర‌ల్‌గా మారింది.

Credit: Instagram