బాలయ్యతో చిందులేయనున్న సోనాల్ !!


Sonal Chauhan and Balakrishna
Sonal Chauhan and Balakrishna

బాల‌య్య‌తో ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ మ‌రో సినిమా తీస్తున్నాడు. ఇంత‌కుముందు “జైసింహా” అనే చిత్రాన్ని తీశాడు. అది విజ‌యం సాధించింది. ఇపుడు మ‌రో కొత్త సినిమా. సీ క‌ల్యాణ్ నిర్మాత‌. ఈ సినిమాని ప్రారంభించి నెల రోజులు పూర్త‌యింది. కానీ హీరోయిన్ల క్యాస్టింగ్ పూర్తి కాలేదు.

ఇపుడు సోనాల్‌తో పాటు మ‌రో హీరోయిన్‌ని కూడా ఫిక్స్ చేయాలి. సంక్రాంతికి విడుదల చేయాల‌ని మొద‌ట భావించారు కానీ ఇపుడు పొంగ‌ల్ పోటీలో ఈ  మూవీ లేదు.”లెజెండ్”, “డిక్టేట‌ర్” సినిమాల్లో బాల‌య్య‌తో న‌టించిన సోనాల్ చౌహ‌న్‌కి మ‌ళ్లీ అవ‌కాశం ద‌క్కింది. బాల‌య్య స‌ర‌స‌న ఇది మూడో ఆఫ‌ర్‌. న‌య‌న‌తార‌, శ్రియా ఇలా ప‌లువురు భామ‌ల‌ను ఈ పాత్ర‌కి ప‌రిశీలించిన త‌ర్వాత సోనాల్‌నే తీసుకోవాల‌నుకున్నార‌ట‌.

సోనాల్ తెలుగులో  రెయిన్‌బో, లెజెండ్, డిక్టేట‌ర్‌, పండ‌గ చేస్కో, సైజ్ జీరో చిత్రాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం ఆమెకి అంత క్రేజ్ లేదు. ఐతే బాడీని మాత్రం సూప‌ర్‌గా మెయిన్‌టెయిన్ చేస్తోంది. పై ఫోటో ఆమె రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసుకున్న‌దే. అలాంటి సోయగాల‌తో కుర్రాళ్ల గుండెల్లో డైన‌మైట్స్ పేలుస్తుంటుంది ఇన్‌స్టాగ్రామ్‌లో. న‌య‌న‌తార ఇప్ప‌ట్లో డేట్స్ ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఆమె పారితోషికం కూడా చాలా ఎక్కువ‌. శ్రియావైపు నిర్మాత మొగ్గు చూపారు. కానీ ఎందుకో శ్రియాకి అవ‌కాశం ద‌క్క‌లేదు. ఇప్పుడు ఈ అవకాశం సోనాల్ ని వరించింది!!