క్యాన్సర్ తో బాధపడుతున్న సోనాలి బెంద్రే


sonali bendre suffering with high grade cancerగ్లామర్ తార సోనాలి బెంద్రే కి క్యాన్సర్ సోకిందట !అది కూడా హై గ్రేడ్ క్యాన్సర్ అని వెంటనే చికిత్స తీసుకోవాలని సూచించారని అంటోంది సోనాలి బెంద్రే . బాలీవుడ్ చిత్రాల్లో నటించి ఓ ఊపు ఊపేసిన ఈ భామ తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది . చిరంజీవి సరసన ఇంద్ర, శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో బాలకృష్ణ సరసన పల్నాటి బ్రహ్మనాయుడు, నాగార్జున సరసన మన్మధుడు , మహేష్ బాబు సరసన మురారి , శ్రీకాంత్ సరసన ఖడ్గం చిత్రంలో నటించింది సోనాలి బెంద్రే .

అయితే చిన్నగా నొప్పి అనిపించడంతో డాక్టర్ల ని సంప్రదించింది అయితే సోనాలి కి రకరకాల పరీక్షల అనంతరం హై గ్రేడ్ క్యాన్సర్ సోకినట్లు వెల్లడించారట ! దాంతో షాక్ కి గురైన సోనాలి ఆ తర్వాత తేరుకొని ధైర్యం కూడదీసుకుందట . ప్రస్తుతం అమెరికాలో చికిత్స తీసుకుంటున్నానని అయితే మానసికంగా పోరాటం చేస్తున్నానని తప్పకుండా కోలుకుంటాననే నమ్మకం ఉందని ట్వీట్ చేసింది సోనాలి బెంద్రే .

క్యాన్సర్ తో యుద్ధం చేస్తున్నానని , నాకు తోడుగా నా కుటుంబ సభ్యులు , స్నేహితులు అండగా నిలిచారని మీ సపోర్ట్ నన్ను భావోద్వేగానికి లోను చేస్తుందని ట్వీట్ చేసింది సోనాలి . క్యాన్సర్ తో పోరాడి పలువురు గెలవగా వాళ్ళ జాబితాలో సోనాలి బింద్రే కూడా చేరాలని ఆశిద్దాం .

English Title: sonali bendre suffering with high grade cancer