‘అల’ పాటలు వచ్చేది ఈ క్రమంలోనేనా?

Songs order in Ala Vaikunthapuramulo revealed
Songs order in Ala Vaikunthapuramulo revealed

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం అల వైకుంఠపురములో ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా ప్రస్తుతం బుట్ట బొమ్మ పాట చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ పాట చిత్రీకరణతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తైపోతుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మరో పక్కన కొనసాగుతున్నాయి. జనవరి 12న ఈ చిత్రం బ్రహ్మాండంగా విడుదల కానుంది. దానికంటే ముందు జనవరి 6న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉందంటే అతిశయోక్తి కాదు. విడుదలైన నాలుగు పాటల్లో, మూడు పాటలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. సామజవరగమన, రాములో రాముల పాటలైతే చెరొక 100 మిలియన్ వ్యూస్ సాధించుకుని యూట్యూబ్ లో హల్చల్ చేస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో పాటలు వచ్చే ఆర్డర్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. దాని ప్రకారంగా విడుదలైన రెండు పాటలు కాకుండా మరో రెండు బిట్ సాంగ్స్ కూడా ఉన్నట్లు సమాచారం. సినిమాలో మొదటి సాంగ్ ను ఎవరైనా చాలా ఈజీగా ఊహించేయొచ్చు. ఓ మై గాడ్ డాడీ అంటూ సాగే పాట మొదట వస్తుంది. దాని తర్వాత రాములో రాముల సాంగ్ ఉంటుంది. మూడో పాటగా అల వైకుంఠపురములో బిట్ సాంగ్ వస్తుందని తెలుస్తోంది. ఈ మూడు పాటలూ కూడా ప్రధమార్ధంలోనే వస్తాయి.

ఇక సెకండ్ హాఫ్ విషయానికొస్తే బుట్ట బొమ్మ, సెకండ్ హాఫ్ మొదలైన కాసేపటికే వస్తుందిట. ఆ తర్వాత రాములో రాముల సాంగ్ ఉంటుందని అంటున్నారు. ప్రీ క్లైమాక్స్ కు ముందు ట్రెడిషనల్ గా సాగే మరో బిట్ సాంగ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ సెకండ్ హాఫ్ లో వచ్చే సాంగ్స్ అన్నమాట. వీటిలో ఓ మై గాడ్ డాడీ, రాములో రాముల, బుట్ట బొమ్మ డ్యాన్స్ కు స్కోప్ ఉన్న సాంగ్స్. ఇప్పటికే కొన్ని మూవ్స్ లిరికల్ వీడియోస్ లో మనం చూసాం. ఈ సాంగ్స్ ఫ్లో కరెక్టో కాదో తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగక తప్పదు.