పంజాబ్ కొవిడ్ -19 టీకా బ్రాండ్ అంబాసిడర్‌గా సోనుసూద్!

పంజాబ్ కొవిడ్ -19 టీకా బ్రాండ్ అంబాసిడర్‌గా సోనుసూద్!
పంజాబ్ కొవిడ్ -19 టీకా బ్రాండ్ అంబాసిడర్‌గా సోనుసూద్!

పంజాబ్‌లోని యాంటీ కరోనావైరస్ టీకా కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు సోను సూద్‌ నియమితుల‌య్యారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్ సింగ్ ఆదివారం తన నివాసంలో నటుడు సోనూ సూద్‌తో సమావేశమైన అనంత‌రం ఈ ప్రకటన వెలువ‌డింది.

గత సంవత్సరం కరోనావైరస్ కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో వలసదారులకు, పేద‌ల‌కు త‌మ సొంత రాష్ట్రాలకు చేరుకోవడానికి సోనూ సూద్ ఎంతో సహాయం చేసారు. కొవిడ్‌-19 మహమ్మారి మధ్య వేలాది మంది నిరుపేదలకు ఆహారం ఇచ్చినందుకు సోనూ సూద్ పేరు ప‌తాక స్థాయికి చేరుకున్న‌ది. అతను వలసదారుల మెస్సీయగా గుర్తింపున‌కు నోచుకున్నారు.

“నటుడు, పరోపకారి సోనుసూద్ కొవిడ్-19 టీకా డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండ‌టానికి ఒప్పుకోవ‌డం చాలా సంతోషంగా ఉన్న‌ది. ప్రతి పంజాబీని కొవిడ్ టీకా చేరుకోవడానికి, వారిని రక్షించడానికి మా ప్రచారానికి మద్దతు ఇచ్చినందుకు సోనూ సూద్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. టీకాలు తీసుకోవాలని అందరినీ కోరుతున్నాను ” అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ తీసుకోవటానికి ప్రజలను ప్రేరేపించడానికి, ప్రభావితం చేయడానికి ఆదర్శంగా ఉండేందుకు ఇంత‌కు మించి మ‌రెవ్వరూ లేరని సింగ్ అన్నారు.

టీకా కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నందుకు సంతోషంగా, గౌరవంగా ఉన్న‌దని న‌టుడు సోనూ సూద్ తెలిపారు. “నా సొంత రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడటానికి పంజాబ్ ప్రభుత్వం చేస్తున్న ఈ భారీ ప్రచారంలో ఏదైనా పాత్ర పోషించడం నాకు చాలా ఆనందంగా ఉన్న‌ది” అని ఆయన చెప్పారు.