ఎల్లలు లేని సోనూ సూద్ సాయం

ఎల్లలు లేని సోనూ సూద్ సాయం
ఎల్లలు లేని సోనూ సూద్ సాయం
  • నెల్లూరు జిల్లా కు ఎంతో విలువైన ఆక్సిజన్ జనరేటర్ సాయం చేసిన సోనూసూద్,దీని విలువ సుమారు 1.5 కోట్లు
  • సోనూసూద్ సాయం కోరుతూ నెల్లూరు జిల్లా కలెక్టర్ లేఖ..వెంటనే స్పందించిన రియల్ హీరో..
  • ఎంత మంది సాయం కోరినా వెంటనే ఆపన్న హస్తం అందిస్తున్న అభినవ కర్ణుడు మన సోనూ సూద్💥
  • ఇప్పటికే 10 కోట్ల మందికి పైగా ఏదో ఒకరకంగా సోనూ సాయం
  • ఐక్యరాజ్య సమితి నుండి ప్రత్యేక గుర్తింపు,ప్రశంసలు

కష్టం వచ్చింది సాయం కావాలన్న ప్రతి ఒక్కరికి లేదనకుండా.. కాదనకుండా సాయం అందిస్తున్నాడు సినీ నటుడు సోనూసూద్. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ దగ్గరనుంచి ఎన్నో విధాలుగా ఎంతో మందికి సేవలు చేస్తూ ఆదుకుంటున్నాడు సోనూసూద్.

తాజాగా సోనుసూద్ నెల్లూరు జిల్లాకు కూడా తన సహాయం అందించబోతున్నారు. జిల్లాలో ఆక్సిజెన్ జనరేటన్ విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు రియల్ హీరో సోనూసూద్. నెల్లూరు జిల్లాలో ఆక్సిజెన్ జనరేటర్ లేక ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని, ప్రజల ముప్పు ఉందని ఆదుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సోనూసూద్ కి లేఖ రాసారు.

కలెక్టర్ లేఖకు స్పందించిన సోనూసూద్. 1.5 కోట్ల విలువైన ఆక్సిజెన్ జనరేటర్ ను అందిస్తానని హామీఇచ్చారు. ఈ జనరేటర్ రోజూ 2 టన్నుల ఆక్సిజెన్ ఉత్పత్తి కెపాసిటీ కలిగి ఉంటుంది. మరో రెండు రోజుల్లో జిల్లాకు ఆక్సిజెన్ జనరేటర్ రానుంది. సోను సాయానికి నెల్లూరు జిల్లా ప్రజలతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు..

సోనూ ఈ కరోనా కష్ట కాలంలో నీ సొంత ఆస్థులు తాకట్టు పెట్టి మరీ సేవాకార్యక్రమలు చేస్తున్న నీలాంటి వారే ఈ దేశానికి నిజమైన హీరో లు అని దేశం యావత్తు సోనూసూద్ కి అభినందనలు తెలియచేస్తున్నారు.