`అల్లుడు అదుర్స్` సెట్‌లో రియ‌ల్ హీరో!


`అల్లుడు అదుర్స్` సెట్‌లో రియ‌ల్ హీరో!
`అల్లుడు అదుర్స్` సెట్‌లో రియ‌ల్ హీరో!

గ‌త ఏడు నెల‌లుగా షూటింగ్‌లు ఆగిపోయిన వియం తెలిసిందే. తాజాగా ఆన్‌లాక్ ప్ర‌క్రియ‌లో భాగంగా మూవీ షూటింగ్స్  ఒక్కొక్క‌టిగా తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల బెల్ల‌కొండ శ్రీ‌నివాస్ హీరోగా న‌టిస్తున్న `అల్లుడు అదుర్స్‌` మూవీ షూటింగ్ మొద‌లైంది. `రాక్ష‌సుడు` మూవీ హిట్‌తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చిన బెల్లంకొండ శ్రీ‌నివాస్ రెట్టించిన ఉత్త‌సాహంతో త‌న కొత్త చిత్రాన్ని మొద‌లుపెట్టారు.

`కందిరీగ‌` ఫేమ్ సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సుబ్ర‌హ్మ‌ణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌భా న‌టేష్‌, అను ఇమ్మానుయేల్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఈ మూవీ చివ‌రి షెడ్యూల్ హైద‌రాబాద్‌లో మొద‌లైంది. ఇందులో సొనుసూద్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. క‌రోనా స‌మ‌యంలో చాలా మందికి హీరోగా మారిన ఆయ‌న సోమ‌వారం ఈ మూవీ కోసం ముంబై నుంచి హైద‌రాబాద్ వ‌చ్చారు. వ‌స్తూ వ‌స్తూనే ఏయిర్ పోర్ట్‌లో సంద‌డి చేసిన ఆయ‌న సెట్‌లో సోమ‌వారం అడుగు పెట్టారు.

బెల్లంకొండ శ్రీ‌నివాస్, ప్ర‌కాష్‌రాజ్‌, న‌భా న‌టేష్‌, సోనుసుద్, బ్ర‌హ్మాజీ, శ్రీ‌నివాస‌రెడ్డి, స‌త్య‌, కాదంబ‌రి కిర‌ణ్‌, చ‌మ్మ‌క్‌చంద్ర‌, దువ్వాసి మోహ‌న్ త‌దిత‌రులపై కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ని రిలీజ్ చేసి వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.