రైతుల‌కు అండ‌గా సినిమా చేస్తున్నరియ‌ల్ హీరో!


రైతుల‌కు అండ‌గా సినిమా చేస్తున్నరియ‌ల్ హీరో!
రైతుల‌కు అండ‌గా సినిమా చేస్తున్నరియ‌ల్ హీరో!

దేశ వ్యాప్తంగా క‌రోనా కార‌ణంగా కేంద్ర ప్ర‌భుత్వం అత్య‌వ‌ర లాక్‌డౌన్ ని స‌డ‌న్‌గా విధించిన విష‌యం తెలిసిందే. జ‌న‌తా క‌ర్ఫ్యూ త‌రువాత క్ష‌ణాల్లో అమ‌ల్లోకి వ‌చ్చిన లాక్‌డౌన్ వ‌ల్ల ఎంతో మంది తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. వ‌ల‌స కూలీలు ప‌డిన వేద‌న‌ గురించి చెప్ప‌డానికి మాట‌లు చాలవు. అలాంటి స‌మ‌యంలో నేనున్నానంటూ ముందుకొచ్చారు సోనూసూద్‌. వారికి అండ‌గా నిలిచి కాలిన‌డ‌క‌న వెళుతున్న వారిని క్షేమంగా గ‌మ్య‌స్థానాల‌కు చేర్చారు. కొంత మందిని ఫ్లైట్‌ల‌లో త‌ర‌లించి వ‌ర‌ల్డ్ వైడ్‌గా రియ‌ల్ హీరో అనిపించుకున్నారు.

దీంతో ఆయ‌నని విల‌న్‌గా కాకుండా కొత్త త‌ర‌హా పాత్ర‌ల్లో హీరోగా చూపించాల‌ని ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. ఈ నేప‌థ్యంలో సోనుసూద్ హీరోగా రైతు స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో `కిసాన్‌` పేరుతో ఓ భారీ చిత్రం మొద‌లైంది. ఈ చిత్రానికి ఇ. నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ విష‌యం తెలిసి బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ చిత్ర బృందాన్ని, సోనుసూద్‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా అభినందించారు.

`డ్రీమ్ గ‌ర్ల్` ఫేమ్ రాజ్ సాండిల్య నిర్మించ‌బోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని చిత్ర బృందం త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నుంది. కేంద్రం ప్ర‌వేశ పెట్టిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పంజాబ్ రైతులు ఢిల్లీ శివార్ల‌లో గ‌త కొన్ని రోజులుగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సోనుసూద్ `కిసాన్‌` మూవీ సెట్స్ పైకి రావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.