బాల‌కృష్ణ – బోయ‌పాటి సినిమాకు రియ‌ల్ హీరో‌!

బాల‌కృష్ణ - బోయ‌పాటి సినిమాకు రియ‌ల్ హీరో‌!
బాల‌కృష్ణ – బోయ‌పాటి సినిమాకు రియ‌ల్ హీరో‌!

న‌టసింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. బోయ‌పాటి శ్రీ‌నుల కాంబినేష‌న్ అంటే భారీ క్రేజ్ ఏర్ప‌డింది. గ‌తంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు అనూహ్య విజ‌యాన్ని సాధించి బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాల్ని న‌మోదు చేసుకున్నాయి. ఈ రెండు చిత్రాల త‌రువాత ఈ కాంబినేష‌న్ ముచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి క‌లిసి ఓ మూవీ చేస్తోంది. `బిబి3 ఫ‌స్ట్ రోర్‌‌` పేరుతో విడుద‌లైన ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొనేలా చేసింది.

మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్ బిఫోర్ ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క ఛేజింగ్ ఎపిసోడ్‌తో పాటు ప‌లు కీల‌క ఘ‌ట్టాల్ని పూర్తి చేశారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ చిత్ర షూటింగ్‌ని గ‌త ఐదు నెల‌లుగా నిలిపివేశారు. ఇందులో కీల‌క‌మైన విల‌న్ పాత్ర కోసం బాలీవుడ్ బ్యాడ్‌మెన్ సంజ‌య్ ద‌త్‌ని ఎంపిక చేసుకుంటున్నార‌ని వార్త‌లు వినిపించాయి. అయితే తాజాగా సంజ‌య్‌కి క్యాన్స‌ర్ అన‌రి తేల‌డం, వెంట‌నే ఆయ‌న ట్రీట్‌మెంట్‌కి వెళ్ల‌డంతో ఆ ప్ర‌య‌త్నాల‌ని బోయ‌పాటి విర‌మించుకున్నార‌ట‌.

అత‌ని స్థానంలో విల‌న్‌గా రియ‌ల్ హీరో సొనుసూద్‌ని ఎంపిక చేసుకున్నార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం సోనూతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న చిత్ర బృందం దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ ఇవ్వ‌నున్న‌ట్టు తెలిసింది. ఈ చిత్రంలో బాల‌య్య డ్యుయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఒక‌టి ఊర మాస్ పాత్ర కాగా మ‌రొక‌టి అఘోరా పాత్ర‌.