మ‌‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న సోనుసుద్‌!

మ‌‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న సోనుసుద్‌!
మ‌‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న సోనుసుద్‌!

వెండితెర‌పై విల‌న్‌గా ఆక‌ట్టుకున్న సోనుసుద్ లాక్‌డౌన్ స‌మ‌యంలో హీరో అయిపోయారు. ఎక్క‌డ ఎలాంటి ఆప‌ద వున్నా తానున్నానంటూ ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. వ‌ల‌స కూలీలు కాలి నడ‌క‌న ఇంటి బాట‌ప‌డితే వారికి అండ‌గా నిలిచి వారిని త‌మ గ‌మ్య‌స్థాన‌ల‌కి చేర్చాడు. లాక్‌డౌన్ స‌మ‌యంలో సోను చేసిన సేవ‌ల్ని గుర్తించిన ఐరాస ప్ర‌త్యేక సేవా పుర‌స్కారంతో స‌త్క‌రించింది.

అవార్డుని సొంతం చేసుకున్న సోనుసుద్ త‌న సేవా కార్య‌క్ర‌మాల‌కు మాత్రం ఎలాంటి బ్రేక్ ఇవ్వ‌డం లేదు. సాయం అన్న వారికి ఏ మూల వున్నా వెంట‌నే రియాక్ట్ అవుతున్నారు. తను చేయ‌ద‌గ్ సాయం చేస్తున్నారు. తాజాగా ఓ గ్రామానికి సెల్ ట‌వ‌ర్‌ని పెట్టించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. లాక్‌డౌన్ అమ‌ల్లో వున్న నేప‌థ్యంలో స్కూళ్లు తెరుచుకోక‌పోవ‌డంతో దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్ క్లాసులు మొద‌లైన విష‌యం తెలిసిందే.

అయితే హ‌ర్యానాకు చెందిన మోర్నీ గ్రామానికి చెందిన ఓ విద్యార్థి సెల్ సిగ్న‌ల్స్ అందని కార‌ణంగా చెట్టుపైకి ఎక్కి క్లాసులు వింటున్నాడు. ఇదే విష‌యాన్ని సోనుసుద్‌కు ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. దీంతో ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న ఆయ‌న గ్రామ పెద్ద‌ల‌తో మాట్లాడి ఆ త‌రువాత ఏయిర్ టెల్ సెల్ ట‌వ‌ర్‌ని ఏర్పాటు చేయించారు. కొన్ని ద‌శాబ్దాలుగా తీర‌ని స‌మ‌స్య‌ని సోనుసుద్ తీర్చ‌డంతో అత‌నిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నార‌ట‌.