`ఆచార్య‌` టీమ్ మెంబ‌ర్స్ ని స‌ర్‌ప్రైజ్ చేసిన సోనుసూద్‌!

`ఆచార్య‌` టీమ్ మెంబ‌ర్స్ ని స‌ర్‌ప్రైజ్ చేసిన సోనుసూద్‌!
`ఆచార్య‌` టీమ్ మెంబ‌ర్స్ ని స‌ర్‌ప్రైజ్ చేసిన సోనుసూద్‌!

సోనుసూద్‌.. లాక్‌డౌన్ స‌మ‌యంలో దేశ వ్యాప్తంగా వినిపించిన పేరిది. క‌రోనా వైర‌స్ వైర‌ల్‌గా విస్త‌రిస్తున్న వేళ ‌సోనుసూద్ పేరు కూడా అదే స్థాయిలో ప్ర‌ధానంగా వార్త‌ల్లో నిలిచింది. లాక్‌డౌన్ విధించిన త‌రువాత వ‌ల‌స జీవులు చాలా దుర్భ‌ర ప‌రిస్థితులుల్ని ఎదుర్కొన్నారు. వారికి అండ‌గా నిల‌బ‌డ‌టానికి ప్ర‌భుత్వాలే చేతులెత్తేశాయి. ఈ నేప‌థ్యంలో వ‌ల‌స కార్మికుల పాలిట హీరోగా నిలిచారు సోనుసూద్.

వారిని గ‌మ్య‌స్థానాల‌కు చేర్చ‌డం కోసం సొంత ఖ‌ర్చుల‌తో బ‌స్సుల‌ని, ట్రైన్‌ల‌ని చివ‌రికి విమానాల‌ని కూడా రంగంలోకి దించారాయ‌న‌. సోనుసూద్ గొప్ప మ‌న‌సుకి యావ‌త్ దేశం మొత్తం ఆయ‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించింది. ఇప్ప‌టికీ ఆయ‌న త‌న సేవా కార్య‌క్ర‌మాలు నిత్యం ఏదో ఒక చోట చేస్తూనే వున్నారు. వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న `ఆచార్య‌` సెట్‌లోనూ సోనుసూద్ త‌న దాతృత్వాన్ని ప్ర‌ద‌ర్శించి టీమ్ మెంబ‌ర్స్‌ని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

`ఆచార్య‌` చిత్రంలో సోనుసూద్ విల‌న్ గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్న సోనుసూద్ `ఆచార్య‌` సెట్‌లో పని చేస్తున్న దాదాపు వంద మంది టీమ్ మెంబ‌ర్స్‌కి వారి పిల్ల‌ల ఆన్ లైన్ క్లాసుల కోసం స్మార్ట్ ఫోల‌ని బ‌హుమ‌తిగా అందించి స‌ర్‌ప్రైజ్ చేశారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫొలోలు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నాయి.