`క్రాక్` హిందీ రీమేక్‌లో హీరో ఎవ‌రో?

`క్రాక్` హిందీ రీమేక్‌లో హీరో ఎవ‌రో?
`క్రాక్` హిందీ రీమేక్‌లో హీరో ఎవ‌రో?

మాస్ మ‌హారాజా ర‌వి‌తేజ న‌టించిన మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్ `క్రాక్‌`. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో స‌ర‌స్వ‌తీ ఫిలింస్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మించారు. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం ఈ సంక్రాంతి బ‌రిలో నిలిచి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. గోపీచంద్ మ‌లినేని – ర‌వితేజ‌ల కాంబినేష‌న్ ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. హీరో ర‌వితేజ మ‌ళ్లీ ఈ మూవీతో ట్రాక్‌లోకి వ‌చ్చారు.

ఇదిలా వుంటే ఈ మూవీ హిందీ రీమేక్ కోసం చాలా మంది పోటీ ప‌డుతున్నారు. ఈ పోటీలో సొనుసూద్ ముందు వ‌రుస‌లో వున్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. లాక్‌డౌన్ కార‌ణంగా సోనుసూద్ రియ‌ల్ హీరోగా మారిపోయారు. ఎక్క‌డ ఏ ఆప‌ద వుందంటే అక్క‌డ నేనున్నానంటూ ముందు నిలిచిన సొనుసూద్ ఇప్పుడు విల‌న్ కాదు దేశ ప్ర‌జ‌ల హృద‌యాల్లో రియ‌ల్ హీరో. అందుకే ఇక‌పై విల‌న్గా కాకుండా హీరోగా న‌టించాల‌ని సోనుసూద్ నిర్ణ‌యించుకున్నార‌ట‌.

అందులో భాగంగానే `క్రాక్‌` రీమేక్ హ‌క్కుల్ని తీసుకుంటున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం నిర్మాత `ఠాగూర్‌` మ‌ధుతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది. అన్నీ ఫైన‌ల్ అయితే త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం వుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని హీరోగా న‌టిస్తూ సోనుసూద్ స్వ‌యంగా నిర్మించ‌బోతున్నార‌ట‌. ఈ మూవీ అక్క‌డ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిస్తే సోనుసూద్ ఇక విల‌న్ పాత్ర‌ల‌కు గుడ్‌బై చెప్ప‌డం గ్యారెంటీ.